ఓటీటీ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్.. ఈ వారం రిలీజయ్యే బ్లాక్‌బస్టర్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలివే.. !

Suma Kallamadi
ఈ వారం నెట్‌ఫ్లిక్స్, ఆహా వీడియో, జీ5 లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో నాని, నారా రోహిత్ లాంటి హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. ఇక హారర్ సినిమాలు ఇష్టపడే వారి కోసం డెమోంటే కాలనీ 2 సినిమా కూడా ఉంది. ఈ బ్లాక్‌బస్టర్ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు మనల్ని అలరించడానికి సిద్ధమైపోయాయి. అవేంటో చూద్దాం!
* సరిపోదా శనివారం:
నాని నటించిన ఈ హిట్ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
* ప్రతినిధి
నారా రోహిత్ నటించిన పొలిటికల్ డ్రామా సినిమా ఆహా వీడియోలో అందుబాటులో ఉంది.
* డెమోంటే కాలనీ 2
తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన హారర్ సినిమా. అరుళ్నితి నటించిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
* అలనాటి రామచంద్రుడు
చిలుకూరి ఆకాశ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
* మెర్సీ కిల్లింగ్
వెంకటరమణ సురపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా సినిమా ఆహా వీడియో, ప్రైమ్ వీడియో రెండింట్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
* జియోంగ్‌సోంగ్ క్రీచర్ సీజన్ 2:
తెలుగులోకి డబ్ అయిన ఈ కొరియన్‌ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండవ సీజన్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
* రెజ్ బాల్:
ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి డబ్ అయిన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో తాజాగా రిలీజ్ అయింది.
* హనీమూన్ ఫొటోగ్రాఫర్
హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు జియోసినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది.
* తాజాఖబర్ సీజన్ 2
హిందీ నుంచి తెలుగులోకి డబ్ అయిన ఈ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ రెండవ సీజన్ ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
* ఫాస్ట్ చార్లీ
ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి డబ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
* చప్రా మర్డర్ కేస్
తెలుగులో డబ్ అయిన ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని ఆహా వీడియోలో చూసేయవచ్చు.
* ఆర్‌టీఐ
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ కోర్టు డ్రామా సినిమా ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
* ఇమ్మాక్యులేట్
తెలుగులోకి డబ్ అయిన ఈ ఇంగ్లీష్ హారర్ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
* ఎక్స్‌హుమా
తెలుగులోకి డబ్ అయిన ఈ కొరియన్‌ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: