చరణ్ అన్న ప్లీజ్.. కనీసం నువ్వైనా అలా చెయ్.. జాన్వీ ఫ్యాన్స్ రిక్వెస్ట్?

praveen
ఫలితంతో సంబంధం లేకుండా దేవర సినిమా థియేటర్లలో దుమ్ము దులిపేస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో, ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై నిర్మితమైన దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన సంగతి విదితమే. ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ పోషించగా, ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. బాక్సాఫీసు వద్ద దేవర కలెక్షన్ల ఊచకోత సృష్టించినట్లు సమాచారం. ఇక ఈ సినిమా మిక్స్‌డ్‌ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా డే 1 వసూళ్లలో టాప్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక అసలు విషయంలోకి వెళితే, ఎన్నో అంచనాలతో హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ పాత్ర ఈ సినిమాలో కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అయిందని ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు అయితే ఈ సినిమాపైన పెదవి విరుస్తున్నట్టు భోగట్టా. నిజానికి ‘దేవర 1’లో తంగం పాత్ర తేలిపోయిందని అంటున్నారు. జాన్వీ ఒక్క చుట్టమల్లే సాంగ్ లో తప్పిస్తే మిగతా సినిమాలో ఆమె నామమాత్రం నటించిందని చెబుతున్నారు. ఈ విషయంలో దర్శకుడు కొరటాల శివని చాలామంది విమర్శిస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ హీరోయిన్  పాత్ర అనుకొని అతిథి పాత్ర చేసిందని కూడా చాలామంది విమర్శిస్తున్నారు.
దాంతో జాన్వీ కూడా ఒకింత అసహనానికి లోనైనట్టు సమాచారం. కాగా జాన్వీ ఇపుడు కొత్త తెలుగు సినిమా పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ భారీ చిత్రం చేయబోతున్నారు రామ్ చరణ్. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందనే విషయం తెలిసినదే. దేవర సినిమాలో జాన్వీ కపూర్ కి పెద్దగా స్క్రీన్ టైం లేదు కాబట్టి, జాన్వీ కపూర్ ఇక చరణ్ సినిమాపైనే ఆశలు పెట్టుకోవడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా తెరకెక్కలేదు కాబట్టి, అప్పుడే జాన్వీ పాత్రను గురించి చెప్పలేము. కాగా జాన్వీ కపూర్, తన టాలీవుడ్ డెబ్యూ కోసం ఎంతగానో ఎదురు చూసింది. కానీ దేవర షాకిచ్చింది. ఇక చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ అయినా జాన్వీకి ప్లస్ కావాలని ఆశిద్దాము!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: