మహేష్ మామయ్య స్టార్ క్రికెటర్.. సునీల్ గవాస్కర్ కి చుక్కలు చూపించాడు ఆయన ఎవరంటే..!
అయితే మొదట సూపర్ స్టార్ కృష్ణ వీరి పెళ్లికి అంగీకరించలేదు.. కానీ మహేష్ నమ్రతను సీక్రెట్‌గా ముంబైలో పెళ్లి చేసుకోవటంతో కృష్ణ సైతం అంగీకరించగా తప్పులేదు. చివరికి ఆయన ముందే హ్యాపీగా ఉండటం చూసి సూపర్ స్టార్ కృష్ణ అర్థం చేసుకొని నా కొడుక్కు ఇంతకంటే మంచి అమ్మాయిని నేను తీసుకురాలేనని ఆలోచన చేసుకొని సైలెంట్ అయిపోయారట. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే అయితే కానీ నమ్రత తండ్రి ఓ స్టార్ క్రికెటర్ అనే విషయం అందరికీ తెలియదు.. ఈ ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.
నమ్రత మహారాష్ట్రలో పుట్టి పెరిగింది. 1977 జనవరి 22న ముంబైలో జన్మించింది. నమ్రత శిరోద్కర్ తండ్రి నితిన్ శిరోద్కర్ అప్పట్లో క్రికెటర్ గా రాణించారు. ముంబై తరఫున ఆడే దేశ వాలి క్రికెట్ లో నమ్రత తండ్రి ఎంతో పేరు సంపాదించుకున్నారు. దిలీప్ వెంగాసర్కార్…. సునీల్ గవాస్కర్ లాంటి స్టార్ క్రికెటర్లతో సైతం నితిన్ శిరోద్కర్ క్రికెట్ ఆడేవారట. ఆయన ఆట తీరు చూసి తోటి క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయేవారట.
అంతేకాకుండా క్రికెట్ లో ఆయన అద్భుతమైన బౌలర్ గా రాణించారు. ఇక నమ్రత తల్లి కూడా కూడా సెలబ్రిటీలు అన్న విషయం చాలామందికి తెలియదు. నమ్రత తల్లి సైతం మోడల్ గా రాణించారు. నమ్రత కూడా ఒకప్పుడు మోడలింగ్ లో పేరు సంపాదించుకున్నారు. అంతేకాకుండా 1993లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్నారు. అదేవిధంగా మిస్ యూనివర్స్ పోటీలకు సైతం నమ్రత ఎంపికయ్యారు. మిస్ యూనివర్స్ గా 5వ స్థానంలో నిలిచారు.