' దేవ‌ర ' ఏపీ - తెలంగాణ 2 రోజుల ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌... అప్పుడే బ్రేక్ ఈవెన్‌కు ద‌గ్గ‌రగా..!

Amruth kumar
దేవరతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్ డే కలెక్షన్లో త్రిబుల్ ఆర్ హయ్యస్ట్ షేర్ సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. అందులో ఎన్టీఆర్ ఒక హీరో.. ఇప్పుడు ఎన్టీఆర్ సోలో హీరోగా దేవ‌ర‌తో సెకండ్ హైయెస్ట్ షేర్ సాధించిన సినిమాగా రికార్డుల‌ను తన పేరు మీద రాసుకున్నాడు. ఇక దేవర ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ.54.21 కోట్ల షేర్ ను రాబట్టింది. రెండో రోజు కూడా మంచి అదిరిపోయే నంబర్స్ నమోదు చేసింది. రెండో రోజు ఏ ఏరియాలో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అంటే..
మొదటి రోజు బెనిఫిట్ షోలో భారీ సంఖ్యలో పడ్డాయి దానికి తోడు టికెట్ రేట్స్ కూడా భారీగా పెంచేశారు. ఇక రెండో రోజు నుంచి తెలంగాణలో టికెట్ రేట్లు కాస్త తగ్గాయి. అందుకని రెండో రోజు కలెక్షన్ లో కూడా కొంత ఈ ఎఫెక్ట్ పడింది. కానీ ఎన్టీఆర్ రెండో రోజున కూడా మంచి  కలెక్షన్ లే రాపెట్టాడు. ఏరియాల వారీగా రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది అనేది చూస్తే.
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే.. నైజాం - 6. 94 కోట్లు వైజాగ్ - 1. 68 కోట్లు సీడెడ్ - 3. 77 కోట్లు ఈస్ట్ - 0. 86 లక్షలు వెస్ట్ - 0. 48 లక్షలు కృష్ణా - 0. 95 లక్షలు గుంటూర్ - 0. 82 లక్షలు నెల్లూర్ - 0.62 లక్షలు
'దేవర' సినిమాకు రెండో రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వచ్చాయి. టికెట్ రేటు మీద జీఎస్టీ యాడ్ చేయకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 70.33 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ భారీ రికార్డ్స్ నమోదు చేసే దిశగా వెళుతోంది. మూడో రోజు కూడా అడ్వాన్స్డ్ బుకింగ్స్ బావున్నాయి. 'దేవర' మొదటి రోజు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ బరిలో 172 కోట్ల రూపాయల షేర్ సాధించింది. హిందీలో మొదటి రోజు రూ. 7 కోట్ల నెట్ సాధించగా... రెండో రోజు 10 కోట్లకు పైగా వసూలు చేసిందని సమాచారం. హిందీలో కలెక్షన్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: