బీ టౌన్‌లో దేవర భీభత్సం... రెండో రోజు కుమ్మిపడేసిన ఎన్టీఆర్ ..!
- రెండో రోజు కూడా రు. 10 కోట్ల వసూళ్ల తో సంచలనం
- ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికే రు. 30 కోట్లు పక్కా అని లెక్కలు .. !
- ( బాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర గా బాక్సాఫీస్ దగ్గర సింహం లా గర్జించేస్తున్నాడు. దేవర కు గురువారం అర్ధరాత్రి మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా తొలి రోజు వరల్డ్ వైడ్ గా ఏకంగా 172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అసలు సిసలు హోల్డ్ కాదు ఇది. ఇక రెండు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రు. 243 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటున్నారు. ఇక దేవర సినిమాకు మొదటి రోజు నార్త్ ఇండియాలో భారీ హైప్ కనిపించలేదని ట్రేడ్ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే... సినిమాకు నెమ్మదిగా ప్రేక్షకులు రావడం మొదలు అయింది. మొదటి రోజు ఈ సినిమాకు హిందీ వెర్షన్ నుంచి ఏడు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చాయి.
నిజంగా అంచనాల తో పోలిస్తే ఇవి చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఇక రెండో రోజు కూడా దేవర బీ టౌన్ బాక్సాఫీస్ దగ్గర కుమ్మి పడేసింది. ఫస్ట్ వీకెండ్ అయ్యే సరికి దేవర హిందీ వెర్షన్ నెట్ కలెక్షన్ రు. 30 కోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాలకు చెందిన విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక హిందీలో దేవర మెల్ల మెల్ల గా ఫికప్ అయ్యి రు. 50 కోట్ల నెట్ వసూళ్లు సాధించినా గ్రేట్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి దేవర హిందీ లో ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో . ఎన్టీఆర్ స్టామినా ఎంత వరకు చూపుతుందో చూడాలి.