ఆ హీరోయిన్ అంత నష్ట జాతకురాలు ఎవరూ ఉండరు..?
శ్రీదేవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగు సినిమాల్లో అడుగుపెడుతుందని తెలిసి చాలామంది ఎంతో సంతోషించారు. ఆమె పాత్రపై భారీ అంచనాలు ఉండేవి. జాన్వీ కపూర్ ‘దేవర’ లాంటి పాన్ ఇండియా సినిమాలోనే హీరోయిన్గా ఛాన్స్ తగ్గించుకుంది. కానీ, ఈ సినిమా ఆమెకు అనుకున్నంత స్థాయిలో మంచి చేయలేదు. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు సినిమాల్లోకి వస్తున్నారు. వీళ్ళలో కొంతమంది మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఉదాహరణకి: మృణాల్ ఠాకూర్ ‘సీతారామం’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటన చాలా బాగుంది. దీంతో తెలుగు ప్రేక్షకులకి ఆమె తెగ నచ్చేసింది.
ఆలియా భట్ భారీ బడ్జెట్ సినిమా ‘RRR’లో నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా వెయిట్ ఉన్నది. నటన కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. దీపికా పదుకొణె సైన్స్ ఫిక్షన్ సినిమా ‘కల్కి 2898 AD’లో చాలా కీలకమైన పాత్ర చేసి ప్రశంసలు అందుకుంది. ఇలా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో మంచి అవకాశాలు సంపాదించుకుంటున్నారు. కానీ, జాన్వీ కపూర్ కి మాత్రం అంత అదృష్టం లభించలేదు.
జాన్వీ కపూర్ చాలా పెద్ద సినిమా కుటుంబం నుంచి వచ్చింది. అందుకే ఆమె తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమెకు మంచి పాత్రలు దొరుకుతాయని అనుకున్నారు. కానీ, ఆమె మొదటి సినిమా ‘దేవర’లో ఆమె పాత్ర అంతగా ఆకట్టుకోలేదు. జాన్వీ కపూర్ పాత్రకు కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కొరటాల శివ. జాన్వి కపూర్ మాట్లాడే తీరు, నడక తీరు సహజంగా లేవు. ఆమె నటనకు కొత్త లాగా ఒక ఫారిన్ అమ్మాయిలాగా కనిపించింది. జాన్వి కపూర్ కి ముందుగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా సీక్వెల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ, ఆమె దాన్ని వదులుకుని ‘దేవర’ ఎంచుకుంది. ఇంకా కొన్ని సినిమాల్లో ఆమెకు ఆఫర్ వచ్చింది కానీ వాటన్నిటినీ వద్దనుకొని ‘దేవర’ ఎంచుకుంది. అదే ఆమె చేసిన తప్పయింది. ఈ సినిమా కూడా ఆమెకు కలిసి రాకపోవడం వల్ల చాలామంది ఈమె అంత నష్టజాతకురాలు ఎవరు ఉండరేమో అని కామెంట్లు చేస్తున్నారు.