భార్యకు తెలియకుండా ఆ హీరోయిన్ తో నిఖిల్ అంత వ్యవహారం నడిపాడా.?

Pandrala Sravanthi
నిఖిల్.. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగిన హీరోలలో నిఖిల్ ఒకరని చెప్పుకోవచ్చు. ఈయన ఒకప్పుడు హ్యాపీడేస్ సినిమాలో ఒక కామెడీ రోల్ లో నటించి ఎంతోమందిని నవ్వించారు.అయితే అలాంటి ఈ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్..కార్తికేయ 2 మూవీతో నిఖిల్ తన పై అందరికీ అంచనాలు పెంచేసాడు.ఇక త్వరలోనే స్వయంభు అనే మరో పాన్ ఇండియా మూవీతో మన ముందుకు రాబోతున్నారు. అయితే అలాంటి నిఖిల్ పల్లవి వర్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి కరోనా టైంలో  అంటే 2020లో జరిగింది. ఇక పెళ్లయ్యాక నాలుగు సంవత్సరాలకు అంటే 2024 ఫిబ్రవరిలో ఈ జంటకు పండంటి బాబు జన్మించారు. అయితే చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న నిఖిల్ ఈ విషయాన్ని బయట పెట్టలేదు. ఇక సినిమాల్లో నటిస్తున్న టైమ్ లో నిఖిల్ పై ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ వినిపించాయి.అయితే  ఓ హీరో హీరోయిన్ కలిసి తరచుగా మీడియాకి చిక్కితే కచ్చితంగా వారి మధ్య ఏదో ఉంది అని రాసేస్తూ ఉంటారు మీడియా జనాలు. 

ఇక నిఖిల్ విషయంలో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది.. నిఖిల్ పల్లవి వర్మతో ప్రేమలో ఉన్న సమయంలో కూడా ఓ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడనే టాక్ వినిపించింది. అయితే నిఖిల్ ప్రేమ విషయం చాలా మందికి తెలియదు. కానీ ఓ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నట్టు మాత్రం టాలీవుడ్ సర్కిల్స్ లో రూమర్ వినిపించింది. ఇక హీరోయిన్ ఎవరయ్యా అంటే.. ఆమె ఎవరో కాదు నిఖిల్ తో స్వామి రారా,కార్తికేయ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన కలర్స్ స్వాతి.. నిఖిల్,స్వాతి కాంబినేషన్లో రెండు సినిమాలు రావడంతో వీరి మధ్య ఏదో ఉంది అనే డేటింగ్ రూమర్లు ఎక్కువైపోయాయి. దాంతో వీరిద్దరూ ఆ రూమర్ ని కొట్టిపారేశారు.

 

అయినా కూడా ఆ రూమర్ ఆగలేదు. ఆ తర్వాత కలర్స్ స్వాతి పెళ్లి చేసుకుంది.అలాగే నిఖిల్ పెళ్లి కూడా జరిగింది.. అలా వీరు తమకి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవడంతో స్వాతి,నిఖిల్ మధ్య వినిపించిన డేటింగ్ రూమర్స్ ఆగిపోయాయి. కానీ పెళ్లికి ముందే నిఖిల్ తన ప్రియురాలు అయినటువంటి పల్లవి వర్మతో ప్రేమలో ఉన్నారు. అయితే పల్లవి వర్మతో ప్రేమాయణం నడిపిస్తూనే మరోవైపు కలర్స్ స్వాతి తో డేటింగ్ చేస్తున్నాడు అనే రూమర్ ఫిలింనగర్ లో చక్కర్లు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: