దేవర 2 అప్డేట్ వచ్చేసింది.. కొరటాల నుండి ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు..?

MADDIBOINA AJAY KUMAR
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా కొరటాల శివ "దేవర పార్ట్ 1" అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ మూవీ మొదటి రోజు భారీ స్థాయి కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇక ఈ మూవీ రెండవ రోజు కూడా పెద్ద మొత్తంలో కలక్షన్లను రాబట్టింది.

అలాగే ఈ రోజు కూడా ఈ సినిమాకు భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందు కొరటాల శివ అనేక ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. అందులో దేవర 2 మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చెప్పాడు. ఇక దేవర 2 మూవీ గురించి కొరటాల శివ మాట్లాడుతూ ... దేవర పూర్తి అయిన తర్వాత వెంటనే దేవర 2 స్టార్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ వరకు ఉన్నాయి. ఎందుకు అంటే దేవర సినిమాలో అనేక మంది నటులు ఉన్నారు. వారంతా దేవర 2 లో కూడా ఉంటారు. వారి కాంబినేషన్స్ సెట్ కావాలి.

అలాగే ఎన్టీఆర్ కూడా చాలా కమిట్మెంట్స్ ఇచ్చి ఉన్నాడు. అవి కూడా పూర్తి కావాలి. దాదాపుగా దేవర పార్ట్ 1 ముగిసిన కొంత కాలానికి దేవా పార్ట్ 2 స్టార్ట్ అవుతుంది. అలా అయితే నేను కూడా వేరే సినిమా చేయకుండా ఉంటాను. ఒక వేళ భారీ గ్యాప్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే నేను ఏదైనా ఓ సినిమా చేసి మళ్లీ దేవర పార్ట్ 2 చేస్తాను అని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇకపోతే దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: