ప్లాప్ దర్శకులకు వరంలా మారిన ఎన్టీఆర్..!!

murali krishna
బాలనటుడిగా సినీ రంగప్రవేశం చేసి.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అద్భుతమైన నటన, అద్దిరిపోయే డ్యాన్స్, ఆకట్టుకునే డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వరుసపెట్టి మాస్ సినిమాలు చేసి.. మాస్ హీరోల లిస్టులో నెంబర్ వన్‌లో నిలిచారు ఎన్టీఆర్. ఆయన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా  ఇండస్ట్రీలో ప్లాఫ్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యడానికి ముందుకు రారు. ఇక ఆ డైరెక్టర్స్ ఎంత మంచి కథతో వచ్చిన ఇంట్రెస్ట్ చూపించరు. గతంలో ఎన్నో బ్లేడక్ బాస్టర్ సినిమాలు చేసిన కూడా ఒక్క ఫ్లాప్ పడితే స్టార్ హీరోలు ఆ డైరెక్టర్స్ ను పక్కన పెడతారు.ఫ్లాప్ డైరెక్టర్లతో సినిమా అంటే ఒకింత రిస్క్ అని భావిస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో జరిగేది ఇదే.. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అలా కాదు. ఆ డైరెక్టర్ లో ఏదో విషయం ఉంది ఫ్లాప్ అయిన పర్వాలేదు సినిమాను తీస్తాను అని ముందుకు వస్తారు. అందరు హీరోలు పక్కన పెట్టినా కూడా ఎన్టీఆర్ ఆ డైరెక్టర్స్ తో సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. గత పదేళ్లలో ఐదుగురు డైరెక్టర్స్ లైఫ్ ఇచ్చాడు. ఇక ఆ ఐదుగురు డైరెక్టర్లు ఎవరంటే పూరి జగన్నాథ్,సుకుమార్,బాబీ, త్రివిక్రమ్,కొరటాలశివ వీరు ప్లాపులతో వెనక్కితగ్గిన సమయంలో ఎన్టీఆర్ టెంపర్,నాన్నకు ప్రేమతో,జైలవకుశ,అరవింద సామెత వీరారాఘవ,దేవర తో కం బ్యాక్ డైరెక్టర్ లుగా ముందుకొచ్చారు.ఇదిలావుండగా వార్‌ 2 సినిమా ఎన్టీఆర్‌ ను బాలీవుడ్‌ ప్రేక్షకులకు కచ్చితంగా దగ్గర చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది చివరి వరకు వార్‌ 2 కోసం వర్క్‌ చేయబోతున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత కేజీఎఫ్‌, సలార్‌ చిత్రాల దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. మరో వైపు దేవర పార్ట్‌ 2 లో ఎన్టీఆర్‌ నటించాల్సి ఉంది. ఎన్టీఆర్‌ రాబోయే రెండేళ్లు బిజీ బిజీగా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: