హీరోయిన్ చేతిలో బండ బూతులు తిట్టించుకున్న స్టార్ హీరోలు ఎవరంటే..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో అంత స్టార్ హీరోలు ఎలా చెబితే అలా జరుగుద్ది.. దర్శక నిర్మాతలు సైతం వారి మాటలకే కట్టుబడి సినిమాలు చేస్తారు. షూటింగ్ సమయంలో అందరూ దర్శకుడు చెప్పినట్లు చేయలి లేకపోతే హీరో ఇష్ట ప్రకారం న‌డుచుకోవాల్సి ఉంటుంది. రెండో విధ‌నం ఏ ఒక్క చిత్ర పరిశ్రమలో లేదు. దాదాపు అన్ని పరిశ్రమలోనూ ఇలాగే ఉంది. అలాంటి చిత్ర పరిశ్రమలో హీరోయిన్ నోట ఇద్దరు స్టార్ హీరోలు చివాట్లు తిన్నారనే విషయం ఇప్పుడు ఆలస్యంగాడ‌వెలుగులోకి వచ్చింది.
అయితే ఇది ఇప్పటి విషయం కాదు కొన్ని దశాబ్దాల క్రితం నాటి స్టోరీ.. అలా చివాట్లు తిన్న హీరోలు ఎవరు? ఎందుకు తినాల్సి వచ్చింది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇంతకీ ఆ స్టార్‌ హీరోలు మరెవరో కాదు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ , అవును వీరిద్దరూ గతంలో కరణ్ అర్జున్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. రాకేష్ రోషన్ తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్గా మ‌మ‌తా కుల‌క‌ర్ణి న‌టించారు.
అయితే బాంగ్డా పాలే  పాట షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్- షారుక్ ఖాన్  ఆ పాటలో వేయాల్సిన డ్యాన్స్ మూమెంట్లు మ‌ర్చిపోయారుట‌. దీంతో మ‌మ‌తా కుల‌క‌ర్ణితో ఏమాత్రం కోఆర్డినేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు డాన్స్ చేస్తున్నారట. చాలాసేపు ఓపిక పట్టిన మమత చివరికి ఇద్దరు హీరోలపై మండిపడిందట. ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు.
ఇప్ప‌టివ‌ర‌కూ సెట్లో న‌న్ను, స‌ల్మాన్ ఖాన్ ని ఎవ‌రూ తిట్ట‌లేదు. అలాంటి అనుభ‌వం ఎప్పుడు మాకు రాలేదు. ఆ ఛాన్స్ ఏ న‌టికి ఇవ్వ‌లేదు. కానీ మ‌మ‌తా కుల‌క‌ర్ణి కొట్టేసింది. స్టెప్పులు మ‌ర్చిపోవ‌డంతోనే మాకి ప‌రిస్థితి ఎదురైంది. ఇద్ద‌రు క‌లిసి పాటంతా పాడుచేస్తున్నార‌ని అంది. ఆమె అలా అంటే ఇద్ద‌రం ప‌క్క‌న నిల‌బ‌డి వేళ్లు చ‌ప్ప‌రిస్తూ చూస్తున్నాం. త‌ప్పు మాదే. స్టెప్పులు బాగా వేసేందుకు ఎక్కువ సార్లు రిహార్స‌ల్స్ చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చింది. ఆమె మ‌మ్మ‌ల్ని తిట్టినా మ‌ళ్లీ మాతో మాట్లాడ‌కుండా ఉండ‌లేక‌పో యింది` అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: