పొలిటికల్ ఎంట్రీ పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్..!!

murali krishna
ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్  హీరోగా నటించిన తాజా చిత్రం దేవర.ఈ నేపథ్యంలో జూ నియర్ ఎన్టీఆర్  రాజకీయాల్లోకి రావాలని టీడీపీ శ్రేణులే కాదు యావత్ ప్రజలు ఎప్పటి నుండి కోరుకుంటున్నారు..కానీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల కంటే సినిమాలే ముఖ్యమని ప్రతి సారి చెపుతూనే ఉన్నారు.గతంలో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేసినప్పటికీ..ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఎన్టీఆర్ కూటమి తరుపున సపోర్ట్ చేస్తారని భావించారు కానీ ఎన్టీఆర్ అస్సలు ఎక్కడ ప్రచారం కాదు కదా..కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా మద్దతు పలకలేదు. తన సినిమాలు ఏంటో..తన పనే ఏంటో తప్ప రాజకీయాల జోలికి వెళ్ళలేదు.తాజాగా దేవర ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా రాజకీయ ప్రస్తావన ఫై ప్రశ్న ఎదురైనా.. రాజకీయాలు కాదు సినిమాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. తొలి నుంచీ తాను నటుణ్ని కావాలనే అనుకున్నానని ,అది తాను తీసుకున్న మంచి నిర్ణయమని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ’17 ఏళ్ల వయసులో తొలి సినిమా చేశాను. అప్పటి నుంచీ నా చూపు నటనవైపే. ఓట్ల సంగతి అలా ఉంచితే నాకోసం టికెట్లు కొంటున్నారు. ఇంతమంది ప్రజల్ని కలుస్తున్నాను. ఇది చాలా ఆనందాన్ని ఇస్తోంది. నటుడిగా సంతోషంగా ఉన్నాను’ అని ఎన్టీఆర్ వివరించారు.ఇక దేవర విషయానికి వస్తే..ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా దేవర. యువ సుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ తో జాన్వి కపూర్ జత కట్టింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ఫస్ట్ డే భారీ వసూళ్లు రాబట్టి..ఎన్టీఆర్ కెరియర్ లో హైయెస్ట్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.ఈ సినిమా మూడు రోజుల్లో 260 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే 300 కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: