సిని ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ' దేవర ' మానియా కొనసాగుతోంది. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీ మూవీ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. జనతా గ్యారేజ్‌తో ఎన్టీఆర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా నటించడంతో గతంలో ఏ సినిమాకు రానంత బజ్ దేవరకు క్రియేట్ అయింది. అంచనాలకు తగ్గట్టుగానే..కొరటాల శివ దర్శకత్వంలో దేవర హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ను ఎలివేట్ చేస్తూ.. ఇచ్చిన అనిరుధ్ ఇచ్చిన బీజీఎం, మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్.ఈ మాస్ అండ్ యాక్షన్ మూవీలో ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ నటించారు. డైరెక్టర్ కొరటాల డైరెక్షన్, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ డూయల్ రోల్ లో తన నట విశ్వరూపాన్ని చూపించారు. తన స్టామినా ఏంటో ఎన్టీఆర్ మరో సారి నిరూపించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. తొలి రోజే దాదాపు రూ.170 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమా మిక్స్డ్ రివ్యూలను అందుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే భారీ వసూళ్లతో టాప్ గా నిలిచింది.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ గత కొన్నేళ్ళుగా పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. నాన్నకు ప్రేమతో, టెంపర్, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్ఆర్ఆర్ ఇలా వరుస విజయాలు సాధించారు. ఇప్పుడు ఈ ఖాతాలోకి దేవర కూడా చేరింది. అయితే ఎన్టీఆర్ ఇప్పుడున్న పరిస్థితి గతంలో లేదు. కొన్నేళ్ల పాటు తారక్ హిట్ లేకుండా సతమతమయ్యారు.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కెరీర్ కి పెద్ద మైనస్ గా మారిన అంశాన్ని కూడా రివీల్ చేశారు.సింహాద్రి వరకు ఎన్టీఆర్ కెరీర్ ఉవ్వెత్తున ఎగసింది. నా కెరీర్ కి అది ప్లస్సా మైనస్సా తెలియదు.. చాలా చిన్న వయసులోనే నాకు సూపర్ స్టార్ డమ్ వచ్చేసింది. సింహాద్రి తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలి, ఎటు వెళ్ళాలి అనేది అర్థం కాలేదు. దీనితో నాలుగేళ్ళ పాటు దారుణమైన ఫ్లాపులు పడ్డాయి. సింహాద్రి, యమదొంగ మధ్యలో ఒక్క హిట్ కూడా లేదు. రాఖి అనే చిత్రంలో నా నటనకి మంచి పేరు వచ్చింది కానీ.. సినిమా కమర్షియల్ గా హిట్ కాదు. ఆ నాలుగేళ్లు పిచ్చెక్కినట్లు అయింది. మైండ్ కూడా సరిగ్గా పనిచేయలేదు. ఒకరకంగా నరకం చూశా.ఎక్కడ తప్పు జరుగుతోంది అని తీవ్రంగా ఆలోచించా. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి సినిమాలో నరకడాలు, చంపడాలు, రొటీన్ ఫైట్స్ ఉండకూడదు అనుకున్నా. అప్పుడే నాలో మార్పు మొదలయింది అని ఎన్టీఆర్ తెలిపారు. స్టూడెంట్ నంబర్ 1 పక్కన పెడితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఎక్కువగా గట్టిగా అరుస్తూ డైలాగులు చెప్పడం, నరకడం లాంటివే ఉంటాయి. యమదొంగ నుంచి అంది మారింది అని ఎన్టీఆర్ తెలిపారు. భవిష్యత్తులో కాలేజ్ కి వెళ్లే కుర్రాడిలా కూడా నటిస్తానేమో అంటూ ఎన్టీఆర్ సరదాగా తెలిపారు.ఇదిలావుండగా ఎన్టీఆర్ తదుపరి వార్ 2లో హృతిక్ రోషన్ తో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇది భారీ మల్టీస్టారర్ చిత్రం. అదే విధంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం కూడా ఇటీవల ప్రారంభం అయింది. మరి దేవర 2 ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి. సెకండ్ పార్ట్ కి లీడ్ గా దేవర 1 క్లైమామ్స్ లో ట్విస్ట్ ఇచ్చారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ సంగీతం అందించారు.