వావ్: బాలయ్య పై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ బ్యూటీ..!

Divya
బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెడితే బాగానే క్రేజ్ సంపాదిస్తున్నారు.. అలాంటి వారిలో ఊర్వశి రౌతేలా కూడ ఒకరు. బాలీవుడ్లో తన అంద చందాలతో మైమరిపించింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా స్పెషల్ సాంగులలో కూడా టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనకు 15 ఏళ్ల వయసులోనే మోడలింగ్ అవ్వగా తన కెరీయర్ని ప్రారంభించి 2009లో మీస్ టీన్ ఇండియా టైటిల్ ని కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత 2013లో మొదటిసారిగా సింగ్ షాప్ ది గ్రేట్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యింది.

తన కెరియర్లో ఊర్వశి రౌతేలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగా తెలుగులో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో స్పెషల్ సాంగ్ తో అదరగొట్టేసింది. ఆ తర్వాత అఖిల్ నటించిన ఏజెంట్.. బ్రో వంటి చిత్రాలలో కూడా నటించింది. స్కంద సినిమాలో కూడా అదరగొట్టేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న 109వ చిత్రంలో కూడా నటిస్తున్నది. దీంతో బాలయ్య గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

తను ఎంతోమంది నటీనటులతో నటించాను చాలామంది పెద్ద యాక్టర్లతో కూడా నటించాను.. బాలయ్య లాంటి పెద్ద యాక్టర్ లెజెండరీ యాక్టర్ పని పట్ల చాలా శ్రద్ధగా వ్యవహరిస్తూ ఉంటారు ఆయన ఇతరులను గౌరవించే విధానం కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా మహిళలను కూడా గౌరవిస్తూ ఉంటారు. అందుకే ఆయన అంటే నాకు చాలా అభిమానం అని ఆయనతో కలిసి పనిచేసినప్పుడు తాను ఎప్పుడూ కూడా ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా అవుతుండడంతో బాలయ్య అభిమానులు ఈ విషయం పైన స్పందిస్తూ.. మా బాలయ్య  ఎవరైనా నచ్చేస్తారు ఆయనతో బాండింగ్ అలాంటిది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: