కామెడీ లో సరికొత్త ఒరవడి సృష్టించిన సునీల్.. ఆ కామెడీ టైమింగే వేరబ్బా..!!

murali krishna


* విలన్ అవుదామని వచ్చి కమెడియన్ గా సెటిల్ అయిన సునీల్
* టాలీవుడ్ టాప్ కమెడియన్ గా 100 కు పైగా చిత్రాలు
*హీరోగా అలరించిన..కమెడియన్ గా నవ్వించిన..విలన్ గా బెదిరించిన సునీల్ కే సాధ్యం..

సునీల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. టాప్ కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు..అసలు సునీల్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి చాలానే కష్టపడ్డారు..సునీల్ కు చిన్నప్పటి నుండి హీరో కావాలనే లక్ష్యం బలంగా ఉండేది..తన ఊహ తెలిసాక తన అందానికి హీరో అంటే జనాలు చూస్తారా అనే అనుమానంతో బెస్ట్ విలన్ గా రానించాలని అనుకున్నారట..సునీల్ కు చిన్నప్పటి నుండి చిరంజీవి అంటే వీరాభిమానం.. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు క్యూ లైన్ లో టికెట్స్ కోసం ఒక యుద్ధమే చేసేవారట.. సునీల్ కు చిరంజీవి డాన్స్ అంటే పిచ్చ ఇష్టం.. ఆయనలాగా డాన్స్ వేయాలని సునీల్ డాన్స్ ఇన్స్టిట్యూట్ లో కూడా చేరారు..సినిమాలలో రానించాలనే లక్ష్యంతో 1994 లో హైదరాబాద్ వచ్చారు..అయితే హైదరాబాద్ వచ్చేందుకు సునీల్ ఏకంగా తన బైక్ ని అమ్ముకొని ఆ డబ్బుతో అవకాశాల కోసం ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగేవారు.ప్రస్తుత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ తో కలిసి సునీల్ రూమ్ షేర్ చేసుకొని వుండేవారు.దీనితో త్రివిక్రమ్, సునీల్ మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది..


త్రివిక్రమ్ రూమ్ లో కూర్చొని కథలు రాసుకుంటుంటే సునీల్ మాత్రం అవకాశాల కోసం ఫిల్మ్ నగర్ చుట్టూ తిరిగేవారు.పవర్ ఫుల్ విలన్ గా నటించాలని అక్కడి డైరెక్టర్స్ కు సునీల్ చెప్పుకొచ్చేవారు..అలా ఎన్ని ప్రయత్నాలు చేసిన ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో సునీల్ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు..తిరిగి ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో సునీల్ మరోసారి అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చారు..యంగ్ హీరో తరుణ్ నటించిన ‘నువ్వే కావాలి’ సినిమాలో కమెడియన్ గా సునీల్ కు మంచి అవకాశం వచ్చింది.. ఆ సినిమాలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించాడు..అలా సునీల్ కు అవకాశాలు వచ్చాయి.. అయితే ఉదయ్ కిరణ్ నటించిన ‘ నువ్వు నేను ‘ సినిమా సునీల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది..ఈ సినిమాతో సునీల్ కొత్త తరం కమెడియన్ గా మంచి గుర్తింపు పొందారు. అలా కమెడియన్ గా సునీల్ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ కమెడియన్ గా ఎదిగారు.. అయితే తాను ఏ లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చారో అది నెరవేరలేదు. ఎలాగైనా ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని భావించారు..

దాదాపు 100 కు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించిన సునీల్ 2006 లో ‘అందాల రాముడు’ చిత్రంతో హీరోగా మారారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ తరువాత కూడా సునీల్ కమెడియన్ గా నటించారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో సునీల్ కు హీరోగా అవకాశం వచ్చింది.అదే ‘మర్యాదరామన్న’ సినిమా.. ఈ సినిమా సునీల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. దీనితో హీరోగా రానించాలని ఫిక్స్ అయ్యాడు..మర్యాద రామన్న తరువాత సునీల్ నటించిన ‘పూల రంగడు’ కూడా మంచి విజయం సాధించింది.. కానీ ఆ తరువాత చేసిన వరుస సినిమాలు సునీల్ కి కలిసి రాలేదు.. దీనితో సునీల్ మళ్ళీ కమెడియన్ గా  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసారు.. సెకండ్ ఇన్నింగ్స్ లో తన డ్రీమ్ రోల్స్ అయిన విలన్ గా నటించడం మొదలు పెట్టారు.. పుష్ప సినిమాలో మంగళం శీను పాత్ర సునీల్ కు విలన్ గా మంచి పేరు తెచ్చింది.. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ కావడంతో సునీల్ అన్ని ఇండస్ట్రీ ల నుండి మంచి ఆఫర్స్ వస్తున్నాయి.. దీనితో సునీల్ విభిన్న పాత్రలతో అద్భుతంగా రానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: