టాలీవుడ్ టూ హాలీవుడ్..సిద్ధార్థ్ పై తెలుగు ఇండస్ట్రీ కక్ష.. ఒక్క మాటతో పాతాళానికి.?

Pandrala Sravanthi
- బ్యాగ్రౌండ్ లేకుండా హిందీలో స్టార్..
- సినిమాల కంటే ఎఫైర్లతోనే ఫేమస్..
- సొంత తప్పిదాలే సిద్ధార్థ్ ని ముంచేసాయా..

 హీరో సిద్ధార్థ్ పేరు చెప్పగానే అందరికీ బొమ్మరిల్లు,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ గుర్తుకొస్తాయి. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఇండస్ట్రీలో ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో తన ఆటిట్యూడ్,మాటల కారణంగానే తెలుగు ఇండస్ట్రీలో పాతాళానికి పడిపోయాడు.. ఇండస్ట్రీలో స్టార్ గా పేరు తెచ్చుకున్న సిద్ధార్థ్ కెరీర్ ఎలా పోగొట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
 సిద్ధార్థ సినీ కెరియర్:
బాయ్స్ మూవీ తో సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ్ ఆ తర్వాత వచ్చిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో ఫేమస్ నటుడిగా మారిపోయారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో సిద్ధార్థ్ కి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత చుక్కల్లో చంద్రుడు సినిమా నిరాశపరిచినప్పటికీ ఎలాంటి హైప్ లేకుండానే బాలీవుడ్లో రంగ్ దే బసంతి అనే మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. దీంతో సిద్ధార్థ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అలా ఆ తర్వాత వచ్చిన బొమ్మరిల్లు మూవీ సిద్ధార్థ్ కి ఎక్కడలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. అలా వరుసగా చేసిన ఆట,కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ వంటి సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఇక మళ్లీ బాలీవుడ్ లో స్ట్రైకర్ మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఈ మూవీ డిజాస్టర్ అయింది. హిందీ తర్వాత మళ్లీ తెలుగులో బావ, అనగనగా ఓ ధీరుడు, 180, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్,సంథింగ్ సంథింగ్, వదలడు, మహాసముద్రం, చిన్నా వంటి సినిమాల్లో నటించారు. ఈయన కేవలం తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ సినిమా అయినటువంటి మిడ్ నైట్ చిల్డ్రన్ లో కూడా నటించి హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకున్నాడు. అయితే అలాంటి సిద్ధార్థ్ కి ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావడం లేదు.
 తెలుగు ఇండస్ట్రీ తిరుగుబాటు :
సిద్ధార్థ్ ఓ సందర్భంలో నేను 1991లో పుట్టి ఉంటే బాగుండేది అప్పటి దర్శకులైనటు వంటి  కే.విశ్వనాథ్ గారు, జంధ్యాల, బాపు గారి లాంటి మంచి డైరెక్టర్ల దర్శకత్వంలో నటించేవాడిని.ఇప్పుడున్న దర్శకులు ఎవరు వారిలా సినిమాలు తీయడం లేదు అంటూ వివాదాస్పద కామెంట్లు చేశారు.ఇక ఈయన మాటలు విన్న తెలుగు దర్శకులు అందరూ ఈయనపై తిరుగుబాటు చేసి వాడికి పొగరు, బలుపు బాగా ఎక్కింది. ఇప్పటినుండి వాడిని సినిమాల్లో తీసుకోకూడదు అని ఫైర్ అయ్యారు. ఇక  ఆ తర్వాత ఓ సినీ ఈవెంట్లో తెలుగు ప్రేక్షకులు కొత్తదనం కావాలి అంటారు. కానీ అలాంటి కొత్తదనంతో సినిమా తీసుకువస్తే దాన్ని ఫెయిల్ చేస్తారు అంటూ తెలుగు ఆడియన్స్ మీద  కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అది మరోసారి వైరల్ అయింది.దాంతో తెలుగు ఇండస్ట్రీ ద్వారా ఎదిగి తెలుగు ఇండస్ట్రీని చిన్నచూపు చూస్తున్నాడు అంటూ దర్శక నిర్మాతలతో పాటు ఆడియన్స్ కూడా ఈయన సినిమాలకు సపోర్ట్ చేయలేదు. అలా మెల్లిమెల్లిగా తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. టాలీవుడ్ లో పూర్తిగా గ్రాఫ్ పడిపోయింది.ప్రస్తుతం తెలుగులో చేస్తాను అన్నా కూడా ఈయనకు సినిమాలు ఎవరు ఇవ్వడం లేదు. అలా తన మాటల కారణంగానే సిద్ధార్థ్  తెలుగు ఇండస్ట్రీలో పాతాళానికి పడిపోయారు. ఇక ఈయన సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్లతో ఎఫైర్లు నడపడం కారణంగా ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయారు. ఇక రీసెంట్ గానే హీరోయిన్ అదితి రావు హైదరీని రెండో పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: