మిమిక్రితో స్టార్ట్ చేసి... అంచెలంచెలుగా ఎదిగిన 'అలీ' సినీ ప్రయాణం..!

FARMANULLA SHAIK
* బాలనటుడిగా రంగప్రవేశం.!
* 'సీతకొకచిలుక' సినిమాతో గుర్తింపు.!
* 1100పైగా సినిమాల్లో నటించిన ఘనత.!
* రెండు నంది, రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గ్రహీత.!
తెలుగు చిత్ర పరిశ్రమలో స్థిరపడి ఒక స్టార్ నటుడిగా గుర్తింపు పొందాలంటే అంటే మాములు విషయంకాదు దానికి ఎంతో కష్టపడాలి.అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా పిలవబడుతున్న స్టార్స్ ఒకప్పుడు ఎంతో కష్టపడినవాళ్లే. అలాంటి వాళ్లలో ప్రముఖ హాస్యనటుడు అలీ ఒకరు.ఆయన ఎవ్వరి సపోర్ట్  ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి  పదకొండు వందలకు పైగా సినిమాల్లో నటించి నేడు ఈ స్థాయిలో ఉన్నారు.ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు.ఆయన తల్లిదండ్రులు అబ్దుల్ సుభాన్,జైతున్ బీబీ.ఆలీ చిన్నప్పటి నుంచే చదువుపై కంటే నటనపై ఆసక్తి పెంచుకుని శ్రీపాద జిత్ మోహన్ మిత్రా బృందంలో మిమిక్రీ కళాకారుడిగా, డ్యాన్సులు, ప్రదర్శనలిచ్చేవాడు.
ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అలీలోని ట్యాలెంట్ చూసిన దర్శకుడు కె. విశ్వనాథ్ తన సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు.తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు తర్వాత ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా రూపొందిస్తున్న 'సీతాకోక చిలుక' చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆయన బాలనటుడిగా దాదాపు 300సినిమాలకు పైగా నటించారు. ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎనిమిదేళ్లు కష్టపడ్డాడు.ఆ తర్వాత ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎంద చాట అంటూ అలీ పండించిన హాస్యం మరో మెట్టు అతన్ని పైకి తీసుకెళ్ళింది.హాస్య పాత్రలు చేసే టైములోనే 'యమలీల' చిత్రం ద్వారా కథానాయకుడిగా మెప్పించాడు అయితే హాస్య పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు.దాదాపు 1100 పైగా సినిమాల్లో చేశారు.
అలాగే ఆలీ తన తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు.సినిమాలతోనే పాటు కొత్త ఆర్టిస్ట్లను ఇండస్ట్రీలోకి పరిచేయడంకోసం ఆలీ 369, ఆలీ తో జాలీగా, ఆలీ తో సరదాగా వంటి పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.ఆయన చేసిన సినిమాలకు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్,రెండు నంది అవార్డ్స్ లాంటి మరెన్నో అవార్డ్స్ అందుకున్నారు.అయితే ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క ప్రజాసేవ చేయడం కోసం రాజకీయాల్లోకి 1999 లో నటుడు మురళీమోహన్ ద్వారా తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకోని అప్పటి ఎన్నికల సమయంలో పలు నియోజక వర్గాల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాడు.రాష్ట్ర విభజన అనంతరం 2019లో వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ప్రచారం చేసినందుకు జగన్ ప్రభుత్వం ఆయన్ను ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.అయితే రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా ఆయన రాజకీయాలకు గుడ్‌ బై చెప్పినట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: