'పుష్ప' మూవీ పై షారుఖ్ ఖాన్ షాకింగ్ కామెంట్స్..?

murali krishna
ప్రతీ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'ఇంటర్నేషనల్ ఇండియన్ ఫెడరేషన్ అకాడమీ'అవార్డ్స్ ని ఈ ఏడాది కూడా గ్రాండ్ గా అబుదాబి లో నిర్వహించారు.ఈ ఈవెంట్ కి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ సూపర్ స్టార్స్ అందరూ విచ్చేసారు. సాధారణంగా ఇలాంటి ఈవెంట్స్ కి బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఈ ఏడాది కూడా ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఆయనతో పాటు బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. హోస్టింగ్ చేయడం లో షారుఖ్ ఖాన్ స్టైల్ వేరు. చాలా ఎంటర్టైన్మెంట్ తో, సరదాగా వచ్చిన అతిథులకు బోర్ కొట్టకుండా తన ఎనర్జీ ని అలా పంపించేస్తాడు. ఈ ఈవెంట్ లో కూడా ఆయన అదే తరహా ఎనర్జీ తో విక్కీ కౌశల్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ ని అందించాడు.ఈ నేపథ్యంలో పుష్ప చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఈ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్ పుష్ప ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. విక్కీ కౌశల్ తో కలిసి ‘తగ్గేదేలే’ మ్యానరిజం చేయడం తో పాటు, ఆ సినిమాలో బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘ఊ అంటావా మావ..ఉఊ అంటావా మావ’ పాటకు ఫన్నీ గా డ్యాన్స్ వేసే ప్రయత్నం చేసాడు.
 ఈ ఐఫా అవార్డుల వేడుకలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఆయన ఆ స్టేజీపైన కీలక వ్యాఖ్యలు చేశారు.ఇక తనను ఉత్తమ నటుడిగా ఎంపిక చేసినందుకు ఐఫా, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు షారుక్ ఖాన్.

మణిరత్నం, ఏఆర్‌ రెహమాన్‌ చేతుల మీదగా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. తన లైఫ్లో ఇదొక గ్రేట్‌ మూమెంట్‌ అని కొనియాడారు. మణిరత్నం, రెహమాన్తో కలిసి పనిచేశానని, వారిని తాను ఎంతో గౌరవిస్తానని తెలిపారు. ఫిల్మ్‌ మేకింగ్కు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విషయాలను ఈ లెజెండ్స్‌ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు. అవార్డులు అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో షారూఖ్, విక్కీ కౌశల్ సరదా సంభాషణలో షారూఖ్ వరస ఫ్లాఫ్ ల గురించి ప్రస్తావన తెచ్చారు. అప్పుడు షారూఖ్ తాను వదిలేసిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి అన్నాడు. అప్పుడు వెంటనే విక్కీ పుష్పకు ఎందుకు నో చెప్పారు అన్నారు. దానికి షారూఖ్ రిప్లై ఇస్తూ...అల్లు అర్జున్ సర్ స్వాగ్ ని నేను మ్యాచ్ చేయలేను అన్నారు. ఆ మాట అనగానే ఆడియన్స్ నుంచి ఓ రేంజిలో రెస్పాన్స్.ఇక తనదైన స్వాగ్ తో తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ గా పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలెబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు అర్జున్ గురించి అదిరిపోయే పోస్ట్ చేసాడు.వీటికి సంబంధించిన వీడియోలను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: