నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరో కార్తికేయ నెగిటివ్ రోల్ పాత్రలో నటించి మెప్పించాడు.ఈ నేపథ్యంలో కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు చూస్తూ చూస్తే హీరోయిన్స్ గా మారిపోతుంటారు.. అర్రే మొనీమద్యే కదా చైల్డ్ ఆర్టిస్ గా నటించింది అంతలోనే ఇంతలా ఎదిగిపోయింది అని ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇప్పుడు అలానే షాక్ ఇస్తుంది ఈ అమ్మడు. నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐదుగురు ఆడవాళ్లకు లీడర్ గా నాని నటించాడు. విక్రమ్ కుమార్ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ యాక్టర్ లక్ష్మీ, శరణ్య కూడా నటించారు. అలాగే నాని సిస్టర్ పాత్రలో ఓ అమ్మాయి నటించింది గుర్తుందా..? ఆమె పేరు శ్రీయ రెడ్డి.త్రూ అవుట్ సినిమా అంతా నానితో ఉంది ఈ అమ్మాయి . నాని గ్యాంగ్ లో ఉన్న ఆడవాళ్లు వయసురీత్యా వరుసగా ఉంటారు. అందులో ఈ చిన్నది లాస్ట్ నుంచి సెకండ్ అన్నమాట. ఇక శ్రీయ రెడ్డి ఈ సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. చనిపోయిన అన్నయ్య కోసం ఎదురుచూసే అమాయక అమ్మాయి స్వాతిగా నటించింది సినిమాలో పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతసేపు చక్కగా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది .? ఎక్కడ ఉంది అన్న ఆసక్తి నెటిజన్స్ లో కలిగింది. ఈ నేపథ్యంలోనే శ్రీయ రెడ్డి కోసం సోషల్ మీడియాను గాలించగా షాకింగ్ ఫోటోలు దర్శనమిచ్చాయి. నాని సినిమాలో నటించిన ఆ చిన్నది ఇప్పుడు ఎలా ఉందో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందంతో, వయ్యారాలతో మతిపోగొట్టింది. అంతే కాదు అందాల ఆరబోతలో కూడా మొహమాట పడకుండా ఫోజులిచ్చి షాక్ ఇచ్చింది ఈ భామ. దాంతో ఈ అమ్మడి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.ఇదిలావుండగా నాని సినిమా తర్వాత ఈ చిన్నది పెద్దగా కనిపించలేదు. గ్యాంగ్ లీడర్ సినిమాలో చాలా పద్దతిగా కనిపించింది శ్రియ. అయితే ఇప్పుడు ఈ అమ్మడు అందాలతో మతిపోగొడుతోంది. నటనకు గుడ్ బై చెప్పింది శ్రియ. ఇక శ్రియ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.