కట్టప్ప కూతురు.. ఏముంది రా బాబు.. అందంతో మతులు చెడగొడుతుందిగా..!

Amruth kumar
కోలీవుడ్ సీనియర్ యాక్టర్ సత్యరాజ్ తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ఒకానొక సమయంలో ఆయన కోలీవుడ్లో స్టార్ హీరోగా రాణించారు. కాస్త వయసు పెరిగాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తెలుగులో కూడా శంఖం, మిర్చి వంటి సినిమాల్లో హీరోలకు తండ్రి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో బాహుబలి సినిమాతో ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. అందులో  కట్టప్పగా ఆయన ఒదిగిపోయారు. ఆ తర్వాత టాలీవుడ్ లో కీ ఆర్టిస్ట్ గా మారిపోయారు.
అంత పాపులర్ అయినప్పటికీ ఆయన మీడియాకు ఇప్పుడు ఎంతో దూరంగానే ఉంటారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఇప్పటికి గోప్యత పాటిస్తూ ఉంటారు. అందుకే సత్యరాజ్ కుటుంబం గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన భార్య పేరు మహేశ్వరి, వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు.ఇక ఇప్పటికే సత్యరాజ్ కొడుకు సిబిరాజ్‌ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి, హీరోగా డోరా, మాయోన్ వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఆయన కూతురు పేరు దివ్య సత్యరాజ్.. ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చిత్ర పరిశ్రమకు ఎంతో దూరం పాటిస్తున్న దివ్య న్యూట్రిషన్ గా తన కెరీర్ను కొనసాగిస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఆమె ఎంతో యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడు తన ఫాలోవర్స్ కి హెల్త్, లైఫ్ స్టైల్ టిప్స్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఫోటోలు బాగా వైరల్ అవ్వడంతో  హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని అందం నీది అంటూ ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు. కాగా దివ్య మహిళ్‌మతి ఇయక్కం పేరుతో  వాలంటీర్ వ్యవస్థను స్థాపించి సోషల్ సర్వీస్ చేస్తుంది. ఆయితే ఆమెకు రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుంది.. ఇదే క్రమంలో ఈమె రాజకీయాల్లోకి  కూడా రాబోతుందని కూడా అంటున్నారు.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పెట్టిన పార్టీలో ఈమే చేరిపోతున్నారనే టాక్ కూడా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: