ఆ స్టార్ హీరో తో చచ్చిన సినిమా తీయను.. కొరటాల హాట్ కామెంట్స్ వైరల్..!

Amruth kumar
టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర ప్రస్తుతం సంచలన కలెక్షన్లు దిశగా పయనిస్తున్న విషయం తెలిసిందే. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లో మాత్రం సునామి సృష్టిస్తుంది. ఇప్పటికే మూడు రోజులకు గాను 300 కోట్లకు పైగా వసూల్లు అందుకుంది. ఎన్టీఆర్ ఆరు సంవత్సరాలు తర్వాత సోలో హీరోగా రావటంతో అభిమానులు థియేటర్ల దగ్గర జాతర చేస్తున్నారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కొరటాల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ ఈవెంట్లో కొరటాలను అల్లు అర్జున్‌తో సినిమా గురించి ప్రస్తావించగా కచ్చితంగా ఆయనతో సినిమా ఉంటుందని, ఆయనకు చెప్పిన కథతోనే సినిమా చేశానని అనుకుంటున్నారని కానీ అల్లు అర్జున్‌తో చేయబోయే కథ దీనికి మించి ఉంటుందని  చెప్పుకొచ్చాడు. గతంలో కొరటాల అల్లు అర్జున్ కాంబోకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల అది ఆగిపోయింది. కానీ ఇప్పుడు కచ్చితంగా బన్నీతో సినిమా ఉంటుందని కొరటాల క్లారిటీ ఇచ్చేశాడు.
చి త్ర పరిశ్రమలో అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.. పవన్ కల్యాణ్ తో ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారని, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని, అంతేకాకుండా ఆయన చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయన్నారు. అవి పూర్తయిన తర్వాత ఆయన సినిమాలు చేస్తారో లేదో గ్యారంటీ లేదని, అప్పటికి రాజకీయాల్లో ఇంకా బిజీగా ఉంటారని, ఆ తర్వాత సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చనేది తన అభిప్రాయం అన్నారు. అటువంటప్పుడు పవన్ కల్యాణ్ తో సినిమా తీసే అవకాశం రాదన్నారు. పవన్ కల్యాణ్ తో సినిమా తీయడం అంటే కష్టమే అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.ఇక దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: