చిరు సినిమాతో పవన్ కొడుకు ఎంట్రీ.. ఆనందంలో మెగా ఫాన్స్..!

Amruth kumar
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని మెగా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురురు చూస్తున్నారు. ప్రస్తుతం అకీరా తల్లి రేణు దేశాయ్‌ దగ్గరే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి పవన్ కళ్యాణ్ తో కనిపిస్తూ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ టైమ్స్ లో అకిరా తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి ఎక్కువగా కనిపించడంతో వీళ్ళిద్దరిని కలిసి ఒకే దగ్గర చూసి ఫ్యాన్స్ ఎంతో ఆనందించారు. ఇప్పుడు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ కొడుకు ఆకిర హీరోగా ఎంట్రీ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
అంతేకాకుండా ఇప్పటికే చాలాసార్లు తల్లి రేణు దేశాయ్‌ని కూడా ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే ఆమె వారికి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అకీరా అసలు సినిమాలు చేస్తాడా లేదా అనే అయోమయంలో పడ్డారు మెగా అభిమానులు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అకిరా నందన్ ఎంట్రీకి సమయం ఆసన్నమైనట్లు పెదనాన్న చిరంజీవి నటిస్తున్న విశ్వంభరా సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా ద్వారా కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడట చిరు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తుంది.. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న విశ్వంభరాలో ఎంతోమంది స్టార్ హీరోలు కూడా కీలకపాత్రలో కనిపించనున్నారు. బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న వశిష్ట ఎంతో పకడ్బందీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొడుకు అకీరా కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని ఫిలిమ్ వర్గాల నుంచి టాక్. అంతే కాకుండా త్వరలో అకీరా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఈ వార్త వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ మాత్రం సంబురాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: