యంగ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకొని చిరు.. విశ్వంభర తో ఆ రేర్ రికార్డ్..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ తర్వాత చిరంజీవి "భోళా శంకర్" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఇక కొంత కాలం క్రితం ఈ సినిమా జనవరి 10 వ తేదీన విడుదల కావడం కష్టం అని వార్తలు వైరల్ కావడంతో ఈ మూవీ దర్శకుడు ఆ వార్తలను కొట్టి పారిస్తూ విశ్వంభర వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన కచ్చితంగా విడుదల అవుతుంది అని పేర్కొన్నాడు. తాజాగా చిరంజీవి చికెన్ గున్యా బారిన పడి సినిమా షూటింగ్ కి దూరంగా ఉండడంతో ఈ మూవీ విడుదల వాయిదా పడే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సారి మూవీ యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో చిరంజీవి యంగ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసుకొని రీతిలో ముందుకు సాగాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కేవలం ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం ఈ మూవీ యూనిట్ 120 కోట్ల ధరను కోడ్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ స్థాయిలో ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల హక్కులను అమ్మినట్లయితే ఈ మూవీ హిట్ కావాలి అంటే భారీ బ్లాక్ బస్టర్ టాక్ కంపల్సరీ అవుతుంది. మరి ఈ సినిమాను ఇదే ధరకు అమ్ముతారా ...? అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: