టాలీవుడ్ టు బాలీవుడ్ : హిందీ పరిశ్రమపై మోజు.. కెరీర్ క్లోజ్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ వచ్చాక హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసిన ముద్దుగుమ్మలు ఎంతో మంది ఉన్నారు. అందులో చాలా తక్కువ శాతం మాత్రమే సక్సెస్ కాగా , ఎక్కువ శాతం మంది ఫెయిల్యూర్ అయ్యారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన తర్వాత హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసి దాదాపు కెరియర్ రిస్క్ లో పడేసుకున్న కొంత మంది ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. అలాంటివారు ఎవరో తెలుసుకుందాం.

ఇలియానా : ఈ ముద్దుగుమ్మ దేవదాసు సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కడం దానితో ఈమె చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ కావడం జరిగింది. అలా సూపర్ జోష్ లో కెరీర్ కొనసాగుతున్న సమయంలో ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. కానీ హిందీ లో ఈమె నటించిన సినిమాలు పెద్ద స్థాయి విజయాలను అందుకోకపోవడంతో హిందీ సినీ పరిశ్రమలో ఈమెకు ఆ తర్వాత అవకాశాలు పెద్దగా దక్కలేదు.

రకుల్ ప్రీత్ సింగ్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ హిందీ సినీ పరిశ్రమపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది. దానితో హిందీ లో పలు అవకాశాలు రాగానే వాటిలో నటించింది. ఈమె నటించిన హిందీ సినిమాలలో చాలా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాల్లో నటించడం లేదు. హిందీ లో కూడా ఈమెకు భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కడం లేదు.

ఇలా ఇద్దరికి మాత్రమే కాకుండా మరి కొంత మంది కి కూడా ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: