బాలీవుడ్ పై టాలీవుడ్ దండయాత్ర.. ఆ హీరోల ఆశలు గల్లంతే..!

Amruth kumar
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. అలా హిందీ బాక్స్ ఆఫీస్ పై తన సినిమాలతో భారీ కలెక్షన్లు అందుకుంటున్నాడు. ఒకప్పుడు హిందీలో స్టార్ హీరోలుగా ఉన్న వారిని పక్కకు జరిపి బాలీవుడ్ కి మాస్ మొగుడు అయ్యాడు.  అదే రూట్ లో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నార్త్ లో సూపర్ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. పుష్ప హిందీ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా లెవెల్లో అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు ఇదే బాటిలో ఎన్టీఆర్ కూడా వెళ్తున్నారు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ మంచి పేరు తెచ్చుకున్నాడు.. అలానే రామ్ చరణ్ కూడా బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో బాలీవుడ్లో తన మార్కెట్‌ను పెంచుకొని అదిరిపోయే రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. దేవుర‌ హిందీలో తొలి వీకెండ్ లోనే రూ.25 కోట్లకు పైగా నెట్ వసూళ్లూ అందుకుంది. ఇది బాలీవుడ్ బాక్సాఫీస్ పై ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. ఈ రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో పలువురు హీరోలు ఈ స్థాయి కలెక్షన్స్ సాధించలేదు దేవ‌ర‌ రాబోయే రోజుల్లో 100 కోట్ల మార్కును కూడా దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తర్వాత సినిమాతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నాడు. దశపతి టు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాతో మహేష్ కు పోనుండే స్టైల్ గుర్తింపు తీసుకురాటమే కాకుండా హిందీ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నానటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదే క్రమంలో ‘పుష్ప 2’ కూడా ఈ ఏడాది విడుదల కావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా కూడా హిందీ మార్కెట్‌ పై దూసుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగు హీరోలు హిందీ బాక్సాఫీస్‌ను సైతం తమ ఆధీనంలోకి తీసుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో విజయవంతం అవుతున్నారని చెప్పొచ్చు. అలాగే అప్పుడప్పుడు నిఖిల్ లాంటి యువ హీరోలు కూడా హిందీ మార్కెట్ పై పట్టు సాధిస్తున్నారు. అతను నటించిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక నెక్స్ట్ స్వయంభూ సినిమాతో మరో బిగ్ సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. ఇక తండేల్ ద్వారా నాగచైతన్య హిందీలో మంచి కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: