వీణ స్టెప్ తో అదరగొట్టిన రాంచరణ్.. మెగాస్టార్ నే మరిపించాడుగా..!!

murali krishna
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్  కాంబినేషన్‌లో రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్ చేంజర్'. శ్రీమతి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా వేచి చూస్తున్నారో తెలిసిన విషయమే. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ ఓ అప్‌డేట్ వదిలారు. అదేంటంటే, తాజాగా ఈ మూవీ నుంచి 'రా మ‌చ్చా మ‌చ్చా..' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పాట‌ను న‌కాష్ అజీజ్ ఆల‌పించ‌గా త‌మ‌న్ బాణీలు అందించారు. ముఖ్యంగా ఈ పాటలో ఇంద్ర సినిమాలో చిరంజీవి వీణ స్టెప్‌ను రీ క్రియేట్ చేయడం విశేషం.
' రా మ‌చ్చా మ‌చ్చా' సాంగ్ ప్రోమో విషయానికి వస్తే,రామ్ చ‌ర‌ణ్ రామ్ చరణ్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ సాంగ్‌ను భారతీయ సినీమా చ‌రిత్ర‌లో నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా స్టార్ డైరెక్ట‌ర్ ప్రోమో విషయానికి వస్తే,రామ్ చ‌ర‌ణ్  ఎనార్జిటిక్, స్టైలిష్ లుక్‌లో రామ్ చ‌ర‌ణ్ ఆక‌ట్టుకుంటున్నారు. ఇక గ్రేస్‌తో ఆయన వేసిన హుక్ స్టెప్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. ఈ స్టెప్ నెత్తింట ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇందులో ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేయ‌టం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏక’త్వమైన మ’న దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్నాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళకారులు ఇందులో భాగం అయ్యారు.ఇదిలావుండగా పాటలో రామ్ చరణ్ లుక్స్... గెటప్ అదిరిపోయాయి. కానీ ట్యూన్ మాత్రం శ్రోతలను ఫుల్ డిజప్పాయింట్ చేసింది.చాలా మంది ఫ్యాన్స్.. అసలు దీన్ని పాటంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి, కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, లీకైన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక రోల్ ప్లే చేస్తున్నాడు. సౌత్ సెన్సేషన్... ఎస్.జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: