25 ఏళ్ల నాటి ఫోటో.. ఆ స్టార్ హీరోయిన్ కు ఫోటోకు ఉన్న లింక్ ఇదే..!

Amruth kumar
మన చిత్ర పరిశ్రమ లోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తున్నారు.. వారిలో కొంతమంది మాత్రమే స్టార్‌డ‌మ్‌ అందుకొని వరుస సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఇదే క్రమంలో కళామతల్ని నమ్ముకున్న‌ వారిని ఎప్పటికీ వారి చేయ విడువదు ఇందుకు ఉదాహరణ స్టార్ హీరోయిన్ త్రిష .. సుమారు 25 ఏళ్లుగా చెక్కుచెదరని అందాలతో తన నటనతో హీరోయిన్గా రాణిస్తుంది. మధ్యలో చిన్న ఆటుపోట్లు ఎదురైనా త్రిష కెరియర్ ఎప్పుడు ఉన్నత స్థాయిలోనే కొనసాగింది .

ముందుగా కోలీవుడ్లో హీరోయిన్గా రాణించిన ఆ తర్వాత ఆమె క్రేజ్‌ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల వరకు వెళ్ళింది. అలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ తో నటించి  స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం త్రిష కెరియర్ మంచి ఫామ్ లో ఉంది.. నిజం చెప్పాలంటే పొన్నియిన్ సెల్వ‌న్‌ సినిమాతో దర్శకుడు మణిరత్నం త్రిషకు మంచి రియంట్రీ ఇచ్చారనే చెప్పాలి. నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటి భామలకు పోటీ ఇస్తూ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు జంటగా నటిస్తుంది. అలాగే గుడ్ బ్యాడ్  అగ్లీ సినిమాల‌తో పాటు అలాగే కమలహాసన్ థ‌గ్‌లైప్‌ చిత్రంలో కూడా నటిస్తుంది.

అలాగే తెలుగులో చిరంజీవితో కలిసి విశ్వంబర‌, మలయాళం లో మోహన్ లాల్ తో కలిసి నటిస్తూ ఫుల్ బిజీగా కొనసాగుతుంది. త్రిష కెరియర్ మొదటిలో అందాల పోటీల్లో పాల్గొని మిస్ చెన్నై కిరీటాన్ని గెలుచుకున్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె ఆ కిరీటాన్ని 1999లో గెలుచుకున్నారు.. అది జరిగి 25 ఏళ్లు గడిచిన సందర్భంగా ఆమె తన మధురమైన స్మృతులను తలుచుకుంటూ తన సోష‌ల్ మిడియ‌ లో పలు ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆవి తన జీవితాన్ని మార్చిన రోజు అంటూ కొటేషన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: