అజిత్ ఒడిలో వున్న బుడ్డోడిని గుర్తు పట్టారా..?ఇప్పుడొక స్టార్ హీరో..!!

murali krishna
 ప్రస్తుతం సినీ ప్రపంచంలో టాప్ స్టార్లుగా వెలుగొందుతున్న నటీనటులు చిన్నప్పుటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు తీసిన పాత ఫోటోలను చూసి వాళ్ల అభిమానులు అబ్బుర పడిపోతున్నారు.ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ హీరో అజిత్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో అజిత్ ఒడిలో కూర్చున్న ఆ చిన్నోడు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ హీరో. ముఖ్యంగా తమిళ్ చిత్రపరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్. విభిన్న కంటెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఫస్ట్ మూవీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. మంచి కథాంశం ఉన్న సినిమాలను ఎంచుకుని తమిళ చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇటీవల అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అతడు మరెవరో కాదండి.. స్టార్ హీరో అట్టకత్తి దినేశ్. 2012లో విడుదలైన ‘అట్టకత్తి’ సినిమాతో దినేష్ జనాల్లో పాపులర్ అయ్యారు. ఈ సినిమా నుంచే దినేష్ రవి కాస్త అట్టకత్తి దినేష్ అయ్యారు. ఆ తర్వాత ‘కోకిల’, ‘తిరుడాన్ పోలీస్’, ‘ఇందిర’, ‘తమిళనుకు ప్రెస్ నంబర్ 1’, ‘కబాలి’, ‘ఒరు నార్ కూత్తు’, ‘అన్నానుకు జే’ వంటి సినిమాల్లో దినేష్ తన నటనతో తమిళ ప్రేక్షకులను అలరించారు. 

ఇదిలావుండగా అట్టకత్తి దినేశ్ హీరో విజయ్ సేతుపతి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్లిద్దరూ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. కాకపోతే విజయ్ సేతుపతికి వచ్చినంత స్టార్ స్టేటస్ దినేష్‌కు రాలేదు. 1996లో తమిళ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి జర్నీ మొదలైంది. మొదట చిన్న చిన్న పాత్రలు చేశారు. 2004లో జయం రవి హీరోగా వచ్చిన ‘ఎన్ కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి’ సినిమాలో చిన్న పాత్ర చేశారు. ఇది ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాకు రీమేక్.ఆ తర్వాత 2006లో సన్ టీవీలో వచ్చిన తమిళ సీరియల్‌లో విజయ్ సేతుపతి.. భరణి అనే పాత్ర పోషించారు. ఈ సీరియల్‌లో అట్టకత్తి దినేష్ కూడా నటించారు. అలా వీళ్లిద్దరి స్నేహం మొదలైంది. ఇక ఆ తరవాత వీళ్లిద్దరూ సినిమాలపై దృష్టి పెట్టారు. 2012లో వచ్చిన ‘సుందరపాండియన్’ సినిమాతో విజయ్ సేతుపతికి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారాన్ని విజయ్ సేతుపతి అందుకున్నారు.ఇలా ఈ ఇద్దరు నటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. కాకపోతే విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగా పాపులర్ అయ్యారు. ఇదిలావుండగా దినేష్ ప్రధాన పాత్రలో నటించిన లబ్బర్ పండు సినిమా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చింది. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ఈఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించారు. సరదాగా సాగే ఈ క్రికెట్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: