ఎన్టీఆర్‌ భార్యతో గొడవలు...కారణం ఆ దర్శకుడేనా ?

Veldandi Saikiran
గత ఆరు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం దేవర. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో.... ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుందన్న సంగతి తెలిసిందే. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ. 172 కోట్లు సాధించి రికార్డు కొల్లగొట్టింది.

మూడు రోజులు కలిపి ఈ సినిమాకు రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా దేవర సినిమా నిలిచింది. ఇదిలా ఉండగా.... ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఎన్టీఆర్ చాలా సందర్భాల్లో తన కుటుంబం గురించి, తన భార్య గురించి మాట్లాడుతూనే ఉంటారు.

ఇటీవల ఓ సందర్భంలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతితో ఉన్న సంబంధం గురించి వివరించారు. తాము కూడా అందరిలాగే భార్యాభర్తల లాగే ఉంటామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం చాలా సహజం. మా మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయని ఎన్టీఆర్ తెలిపారు. కానీ ఓ చిన్న విషయంలో మాత్రం ఇద్దరం తరచూ గొడవలు పడతామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఏసి విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుందని, ఏసీ ఎంతలో ఉండాలని విషయంపై గొడవ పడే వాళ్ళమని ఎన్టీఆర్ చెప్పారు.

అయితే ఎన్టీఆర్ కోసం ఆ విషయంలో లక్ష్మీ ప్రణతి చాలా కాంప్రమైజ్ అయ్యేదని తెలిపారు. తాను మాత్రం ఆమె కోసం ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివతో సినిమా ఎందుకు చేస్తున్నావని నా భార్య నన్ను నిలదీసింది. కానీ ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అవడంతో తను చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ప్రస్తుతం ఈ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: