డీఎస్పీ ని పక్కన పెట్టేసి ఆ మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూస్తున్న నాని.. వర్కౌట్ అయితే ఇక అంతే..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం ప్రారంభంలో దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నాని పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో హాయ్ నాన్న అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సంవత్సరం సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాని హీరోగా రూపొందిన దసరా మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించాడు.

ఈ మూవీ తోనే ఈయన దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు. మొదటి మూవీ తోనే శ్రీకాంత్ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే దసరా సినిమాలో తన పని తనం నచ్చో , లేక అతని దగ్గర ఉన్న కథ నచ్చో తెలియక కానీ ఈయనకు మరో అవకాశాన్ని నాని ఇచ్చాడు. వీరి కాంబోలో మరికొన్ని రోజుల్లో నెక్స్ట్ మూవీ ప్రారంభం కాబోతోంది. దసరా మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. వీరి రెండవ మూవీ కి కూడా అతనే సంగీతం అందిస్తాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

తాజాగా నాని శ్రీకాంత్ కాంబో మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ యూనిట్ తాజాగా అనిరుద్ రవిచంద్రన్ ను అప్రోచ్ అయినట్లు , ఆయన కూడా ఈ సినిమాకు సంగీతాన్ని అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈయన నిజంగానే ఈ మూవీ కి సంగీతం అందించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మూవీ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: