వీరసింహారెడ్డి, దేవర విషయంలో జరిగిన తప్పిదే.. దర్శకుల్లో మార్పు వస్తుందా?

Reddy P Rajasekhar
గతేడాది థియేటర్లలో విడుదలైన వీరసింహారెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా చాలామంది ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని సెకండాఫ్ ఆశించిన స్థాయిలో లేదని కామెంట్లు చేశారు. ఇంటర్వెల్ లో వీరసింహారెడ్డి పాత్ర చనిపోవడం కూడా సినిమాకు మైనస్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే వీరసింహారెడ్డి విషయంలో జరిగిన తప్పే దేవర విషయంలో జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
దేవర సినిమాలో సైతం దేవర పాత్ర చనిపోయిందని ప్రచారం చేయడం సినిమాకు ఒక విధంగా మైనస్ కావడంతో పాటు సీక్వెల్ పై అంచనాలను తగ్గించిందని చెప్పవచ్చు. అదే సమయంలో సినిమాలలో ఫస్టాఫ్ హైలెట్ గా ఉండి సెకండాఫ్ ఆ అంచనాలకు అనుగుణంగా లేకపోతే పెద్ద సినిమాలకు భారీ నష్టమని వీరసింహారెడ్డి, దేవర సినిమాల విషయంలో ప్రూవ్ అయిందని చెప్పవచ్చు.
 
దర్శకులు హీరోలను డ్యూయల్ రోల్ లో చూపించే సమయంలో పవర్ ఫుల్ గా చూపించిన పాత్రను చంపేయడం కరెక్ట్ కాదు. ఫ్లాష్ బ్యాక్ లో ఆ పాత్రలు చనిపోతే తప్పు లేదు కానీ వర్తమానంలో ఆ పాత్రలు చనిపోతే సినిమాకు మైనస్ అవుతోంది. అఖండ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించినా రెండో పాత్రను పవర్ ఫుల్ గా చూపించడం సినిమా సక్సెస్ లో కీలకమైంది.
 
అఖండలో ఆ పాత్ర చనిపోదు కాబట్టే సీక్వెల్ పై కూడా అంచనాలు ఆమాంతం పెరిగాయని చెప్పవచ్చు. లెజెండ్ సినిమా విషయంలో సైతం ఇదే రూల్ ను ఫాలో అయ్యారని చెప్పవచ్చు. హీరోలను డ్యూయల్ రోల్ లో చూపించే విషయంలో రొటీన్ ఫార్ములాను ఫాలో అయితే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి దర్శకులు ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్  జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలపై అంచనాలు భారీ స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: