ఆమె నన్ను కుక్కలా చూసింది.. కుక్క బిస్కెట్స్ వేసింది.. ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు..!!

murali krishna
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. అక్కినేని నాగార్జునతో ఆయన రూపొందించిన శివ సినిమా బాక్సాఫీస్‏ను షేక్ చేసింది. ఇప్పటికీ ఎప్పటికీ యూత్‏కు ఎక్కువగా కనెక్ట్ అయిన సినిమా అది. ఆ తర్వాత క్షణ క్షణం, సర్కార్, మనీ చిత్రాలతో సినీ పరిశ్రమలో సంచలనాలు సృష్టించారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‏గా ఉంటారు వర్మ. ఇంట్రెస్టింగ్ విషయాలను నెట్టింట పంచుకుంటారు. తాజాగా తన అభిమాన హీరోయిన్ దివంగత నటి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. వర్మకు ఓసారి శ్రీదేవి కుక్క బిస్కెట్స్ వేసిందట. ఇంతకీ ఆ సందర్భం ఏంటో తెలుసా..?రామ్ గోపాల్ వర్మకు ఏంటి.. శ్రీదేవి ఏంటి.. కుక్క బిస్కెట్లు వేయడం ఏంటీ అని పెద్ద డౌట్ అందరికి రావచ్చు అయితే ఈ విషయాన్ని ఎవరో కాదు స్వయంగా వర్మనే.. శ్రీదేవి ముందే అన్నారు. ఇంతకీ ఆయన ఏ సంద్బంలో ఈమాట అన్నారో తెలుసా. శ్రీదేవి మీద అభిమానాన్ని ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా తెలుపుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అందులో భాగంగా ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు అన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు.గతంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంద సినిమాలకు సబంధించి ఈటీవిలో కార్యక్రమం ఒకటి వచ్చింది. అందులో ఒ ఎపిసోడ్ లో పాల్గొన్నారు రామ్ గోపాల్ వర్మ. వర్మతో పాటుగా శ్రీదేవి కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్నారు. ఈక్రమంలోనే శ్రీదేవి కెరీర్ లో మంచి పేరు తెచ్చిన సినిమాలు.. ఆమెను నిలబెట్టిన టాలీవుడ్ సినిమాల గురించి హోస్ట్ సుమ శ్రీదేవిని ప్రశ్నించారు. దానికి శ్రీదేవి ఇచ్చిన ఆన్సర్ తో రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ చేశారు.
శ్రీదేవి ఏమన్నారంటే.. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తన కెరీర్ లో అద్భుతం అని అన్నారు. దాంతో పాటు మరికొన్ని సినమాల పేర్లు చెప్పిన శ్రీదేవి.. చివరిగా క్షణం క్షణం సినిమా కూడా తన కెరీర్ కు చాలా ఇంపార్టెంట్ అని అన్నారు. దాంతో అలిగిన ఆర్జీవి... ఏదో కంటితుడుపుగా అంటున్నారు. కుక్కు బిస్కెట్ వేసినట్టు.. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి.. కావాలని అలా అంటున్నారు అని అన్నారు.దానికి శ్రీదేవి తో పాటు... అక్కడే ఉన్న రాఘవేంద్రరావు కూడా సమాధానం చెపుతూ.. అదేం లేదు. ఆసినిమా ఎంత హిట్ అయ్యింది. అప్పట్లో ఎంత అద్భుతం క్రియేట్ చేసింది అనే విషయం అందిరిక తెలుసు అన్నారు. .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: