నా మొగుడు నాకే కావాలి.. స్టార్ హీరో భార్య షాకింగ్ వీడియో వైరల్..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నెలకు ఒకరు విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తున్నాయి. ఇప్పుడు కోలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్  కపుల్స్ గా  ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న జయం రవి ఆర్తి, విడాకుల వ్యవహారం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎంతో ఆనందంగా ఉండే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని తెలియడంతో వారి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. పరస్పరం ఇద్దరు అంగీకారంతోనే విడిపోతున్నామని జ‌యం రవి తాజాగా పోస్ట్ చేయగా.. తనతో ఎలాంటి అనుమతి లేకుండానే డైవర్స్ ప్ర‌క‌ట‌న‌ చేశారని తన భర్తతో మాట్లాడేందుకు తాను ప్రయత్నిస్తున్నానని ఆర్తి ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టింది.
ఆ తర్వాత  జయం రవి ఓ స్టార్ సింగర్ తో రిలేషన్లో ఉన్నాడంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. తన‌పై వచ్చిన వార్తల్లో నిజం లేదని అలాగే  విడాకుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదని..  తన ఇంట్లో ఉన్న వస్తువులను తనకు తిరిగి ఇప్పించాలంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు జయం రవి . ఇలా వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా ఈ వార్ జ‌రుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తనపై వస్తున్న అసత్య వార్తలపై గట్టిగానే రియాక్ట్ అయింది జయం రవి భార్య‌ ఆర్తి.
జయం రవి ఆస్తులు మొత్తం ఆర్తి చేతుల్లోనే ఉన్నాయని.. తన భర్తను ఇంటి నుంచి గెంటేసిందని.. దీంతో తన వస్తువులను తిరిగి ఇప్పించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడని ఓ న్యూస్ ఆర్తికి వ్యతిరేకంగా నెట్టింట వైరలయ్యింది. ఈ క్రమంలోనే తన భార్య ఆర్తిపై జయం రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడనే టాక్ కూడా నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై నెట్టింట ఓ నోట్ షేర్ చేసింది ఆర్తి. ప్రస్తుతం తాను మౌనంగా ఉన్నానంటే తప్పు చేసినట్లు కాదని.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారని కొందరు నెటిజన్లపై మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: