మంచు లక్ష్మిలో మల్టీ టాలెంట్.. ఎన్టీఆర్ పాటకు అదిరిపోయే స్టెప్పులు.. వీడియో వైరల్..!

Divya
టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు పొందిన మోహన్ బాబు తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించడమే కాకుండా విలన్ గా కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఈయన వారసురాలిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరైన సక్సెస్ అందుకోలేకపోతోంది.ఒక వైపు సింగర్ గా, నటిగా, నిర్మాతగా మల్టీ టాలెంటెడ్ ఉన్నప్పటికీ ఎందుకో మంచు లక్ష్మి సక్సెస్ కాలేదు. గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం అభిమానులకు ఏదో ఒక సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఉంటుంది.

అలాగే తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వీడియోలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటుంది మంచు లక్ష్మి. అయితే ఇప్పుడు తాజాగా మంచు లక్ష్మి షేర్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది.. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రంలోని చుట్ట మల్లే సాంగ్ కు మంచు లక్ష్మి సింగిల్ గా స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.  మంచు లక్ష్మి ఈ పాటను రీ క్రియేట్ చేస్తూ రీల్స్ చేయడం జరిగింది. మంచు లక్ష్మి బ్లాక్ శారీలో చాలా ఉత్సాహంగా స్టెప్పులు వేసినట్లుగా కనిపిస్తోంది.

అనంతరం అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా షేర్ చేసి అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది మంజు లక్ష్మి.. దీంతో పలువురు నేటిజన్స్ సూపర్ డాన్స్ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉండగా మరి కొంతమంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని మంచు లక్ష్మి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. మంచు లక్ష్మి తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పాత నచ్చితే నటిస్తూ ఉంటుంది. మోహన్ బాబు కుమారుల సినీ కెరియర్ కూడా పెద్దగా సక్సెస్ బాట పట్టలేదు. మంచు విష్ణు, మోహన్ బాబు వంటి వారు కన్నప్ప చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: