పవన్ తిరుమల పర్యటనపై.. పూనమ్ మరో ట్విట్.!
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమార్తెలతో కలిసి తిరుమల తిరుపతిని దర్శించుకోవడం జరిగింది. అలాగే తన చిన్న కుమార్తె పోలెనా అంజనికి తిరుమల శ్రీవారి దర్శనానికి కావాల్సిన డిక్లరేషన్ సైతం ఇవ్వడం జరిగింది. తన ఇద్దరి కూతుర్లతో కలిసి ఇలా ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ వాస్తవానికి భార్యకు మాత్రమే మహా ద్వారకం ద్వారా ఎంట్రీ ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగానే పవన్ కళ్యాణ్ తన కూతుర్లతో కలిసి ఇలా మహాద్వారం ద్వారా వెళ్లారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాల ప్రోటోకాల్ పాటించకుండా వెళ్లడంతో చాలామంది విమర్శించారు. ఇలా పవన్ కళ్యాణ్ దర్శన కోసం వెళ్లడంతో సాధారణ భక్తులు కూడా కొన్ని గంటల పాటు నిలబడిపోయారు. తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటన పైన పూనమ్ ఇలా ట్విట్ చేస్తూ.. ప్రతి ఒక్కరికి కుమార్తె ముఖ్యమే అంటూ ఒక పోస్ట్ ట్వీట్ చేసింది.. అయితే పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా తన కూతుర్లతో తిరుమలకు వెళ్లడం వల్ల ఉద్దేశించే ఈమె ఇలాంటి ట్వీట్ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే తన కూతుర్లను అక్కడికి తీసి వెళ్ళారంటూ పలువురు నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.