సినిమా పేరు 'బహిర్భూమి'.. ఇంతకీ మూవీలో ఏం చూపించారో తెలుసా?

praveen
ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకుల పంథా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఉన్న కమర్షియల్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు ప్రేక్షకులు. కానీ నేటి రోజుల్లో రా అండ్ రస్టిక్ కంటెంట్ ఉన్న సినిమాలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి సినిమాల్లో పెద్దగా స్టార్స్ లేకపోయినా సరే ఇక బ్లాక్ బస్టర్ విషయాలను కట్టబెడుతూ ఉండడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. దీంతో నేటి రోజుల్లో చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తుండటం కనిపిస్తోంది.

 రా కంటెంట్ కు తోడు మాస్ యాక్షన్ కలగలిపి వచ్చిన సినిమాలకు బాగా ఆదరణ దక్కుతుంది. ఇక ఇప్పుడు ఇలాంటి సహజత్వంతో పీక్ మ్యాడ్ నెస్ ఒక మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదే బహిర్భూమి. సినిమా టైటిలే కాస్త డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. అవును సినిమా కూడా అంతకంటే డిఫరెంట్ గా ఉండబోతుంది. ఏకంగా ఈ మూవీ ఈ నెల 4వ తేదీన విడుదల కాబోతుంది. రాంప్రసాద్ కోడూరి దర్శకత్వంలో నోయల్ హీరోగా నటించిన ఈ మూవీలో  హీరోయిన్గా రిషిత నటించింది. మహాకాళి ప్రొడక్షన్స్ పతాకంపై మచ్చ వేణుమాధవ్ ఈ సినిమాను నిర్మించారు.

 బహిర్భూమి అనే పదం ఎక్కువగా గ్రామాల్లో వాడుకలో ఉంటుంది. అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుండడంతో.. ఈ పదాన్ని దాదాపుగా మరిచి పోయారు. ఇప్పుడు ఇలాంటి పదంతో సినిమా రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే సినిమా పేరు బహిర్భూమి ఇంతకీ సినిమాలో ఏం చూపించబోతున్నారో అని అనుకుంటున్నారు కదా.. ఈ సినిమా అన్ని జోలర్ల మేలవింపుగా ఉంటుందట. కామెడీ థ్రిల్లర్ యాక్షన్ సస్పెన్స్ అంశాలు కూడా ఉంటాయట. బహిర్భూమికి వెళ్ళినప్పుడు జరిగే సంఘటన ఆధారంగానే ఈ సినిమా సాగుతుందట. సినిమాలో కొంత బోల్డ్ కంటెంట్ కూడా ఉంటుంది అనేది తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: