ప్రభాస్ ను అనుష్క ముద్దుగా ఏమని పిలుస్తుందంటే.. దాని వెనక అంత కథ నడిచిందా..!

Amruth kumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హోమ్లీ బ్యూటీ అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలని టాలీవుడ్ మొత్తం 1000 క‌ళ్ళ‌తో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే .. కానీ రీసెంట్గా అనుష్క ఓ బిజినెస్ మాన్ తో ఎంగేజ్మెంట్ చేసుకుందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజమం ఉందో తెలియదు కానీ. ప్రభాస్ - అనుష్క స్నేహం గూరించి తెలిసిందే .. ఇక వీరిద్దరూ కలిసి మూడు సినిమాలకు పైగా కలిసి నటించారు. బిల్లా సినిమాతో మొదలైన వీరి జర్నీ మిర్చి, బాహుబలి  సినిమాల వరకు నటించారు. ఇక వీరి కెమిస్ట్రీ ఎప్పటికీ ఎవర్గ్రీన్ అని కూడా చెప్పుకుంటారు. అప్పట్లో రెబల్ స్టార్ స్వీటీ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వీరికి ఓ బాబు కూడా జన్మించారు అంటూ పలు ఫోటోలు కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఇక పోతే అనుష్క .. పాన్ ఇండియా స్టార్ ను అందరి ముందు బాహుబలి షూటింగ్ సమయంలో సెట్ లో టీజింగ్ చేస్తూ ఏడిపించేసిందట. ఒకవేళ ప్రభాస్ కనిపించకపోతే నా కొడుకు, నా బాబు ఎక్కడ అని అడిగేదట. దీంతో ప్రభాస్ ఓసారి తలపట్టుకున్నాడట. ఇలా సెట్ లో ఫన్నీగా రెబల్ స్టార్ ను ఆటపట్టిస్తూ ఏడిపించిన విషయం గతంలో అనుష్క ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం అనుష్క కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బాహుబలి పార్ట్-2 లో అనుష్కకు కొడుకుగా మహేంద్ర బాహుబలి రోల్ లో నటించిన విషయం తెలిసిందే.
ఇక బహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. అనుష్క మాత్రం అడపాదప సినిమాలు చేస్తూ కెరీర్‌ను సాగదీస్తుంది. గత సంవత్సరం మిస్సెట్టి మిస్టర్ పొలి శెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత మరో సినిమాలో నటించలేదు కనిపించలేదు. ప్రస్తుతం అనుష్క ఏం చేస్తుంది అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇక మరి రాబోయే రోజుల్లో అనుష్క ఎలాంటి సినిమాల తో ప్రేక్షకులు ముందుకు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: