తలైవా రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తన అద్భుతమైన యాక్టింగ్, స్టైల్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకొని సూపర్ స్టార్ గా మారారు.. ఇండియన్ సినీ చరిత్రలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక లెజెండ్..74 ఏళ్ళ వయస్సులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ అంతే ఎనర్జీ తో సినిమాలు చేస్తున్నారు.. సూపర్ స్టార్ స్టైల్ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ వుంది.. ఈ వయసులో కూడా అద్భుతమైన స్టార్ స్టేటస్ తో వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతూ నేటి తరం స్టార్ హీరోలకు ధీటుగా ముందుకు దూసుకుపోతున్నారు.. రజనీకాంత్ రీసెంట్ గా జైలర్ సినిమాతో అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చారు. ఆ సినిమాతో సూపర్ స్టార్ స్టామినా ఏంటో నిరూపితం అయింది.. జైలర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం తలైవా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వేట్టాయన్’జై భీమ్ డైరెక్టర్ జ్ఞాన్ వేల్ రాజ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా అక్టోబర్ 10 న దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం రజనీకాంత్ తీవ్ర అశ్వస్థతకు గురయ్యారు.. మొన్న అర్థరాత్రి ఆయనకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, తమ ఆరాధ్య దైవం కి ఏమి కాకూడదు అని దేవుడికి ప్రార్థనలు చేయడం మొదలు పెట్టారు.ఎట్టకేలకు రజినీకాంత్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, ఆయన సురక్షితంగానే ఉన్నాడని,పొత్తి కడుపు వద్ద అవసరమైన స్టెంట్ వేసాము అని చెప్పడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదిలా ఉంటే రజనీకాంత్ వేట్టయాన్ చిత్రంతో పాటు సమాంతరంగా రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం షూటింగ్ లో కూడా పాల్గొన్నాడు. ఈ సినిమా కూడా 50 శాతం వరకు పూర్తి అయ్యింది. అయితే కోలీవుడ్ నుండి అందుతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల తర్వాత రజనీకాంత్ శాశ్వతంగా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డాక్టర్లు సినిమాలకు దూరంగా ఉండాల్సిందిగా సూచించినట్టు సమాచారం. దీంతో ‘కూలీ’ చిత్రమే రజినీకాంత్ చివరి చిత్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.