కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ లోకం మొత్తం భగ్గుమంది. అంతేకాదు ప్రతిపక్షాలు కూడా ఆమెపై నిప్పులు చెరుగుతున్నారు. ఒక గొప్ప మంత్రి హోదాలో ఉండి మాట్లాడవలసిన మాటలేనా ఇవి అంటూ ఆమెపై మండిపడుతున్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడవాళ్లకు అన్యాయం చేశారంటూ మాట్లాడింది.ఇప్పుడు సమంతపై ఈ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏమైనా సమర్ధించేలా ఉన్నాయా.. ఇలాంటి మాటలు ఎలా వస్తాయి.ఒక రాజకీయ నాయకుడికి సినిమా హీరోయిన్ కి ముడి పెట్టి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంది అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున, సమంత, నాగచైతన్య, ఎన్టీఆర్,నాని, శ్రీకాంత్ ఓదెలా, ప్రకాష్ రాజ్, రోజా వంటి ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించి అలాంటి మాటలు మానుకోవాలి.రాజకీయాల కోసం సినిమా వాళ్ళని మద్యలోకి తీసుకురావద్దు అని బుద్ధి చెప్పారు.
అయితే తాజాగా మాజీ కోడలి మీద చేసిన అర్థం లేని ఆరోపణలపై అక్కినేని అమల స్పందిస్తూ కొండా సురేఖ పై సంచలన కామెంట్లు చేసింది. మీ నీచ రాజకీయాల కోసం సామాన్యులను వాడుకోవడం మంచిది కాదు.ఓ మహిళ మంత్రి రాక్షసి లాగా మారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నమ్మకం లేని మనుషులు చెప్పే మాటలపై ఆధారపడి ఇలా అర్థం లేని ఆరోపణలు నా భర్తపై చేయడం మీకు సిగ్గు అనిపించడం లేదా.. మీరు మాట్లాడే మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోనక్కర్లేదా.. ఛీ ఛీ సిగ్గుచేటు అంటూ మంత్రి కొండా సురేఖ పై అక్కినేని అమల నిప్పులు చెరిగింది.
అలాగే రాహుల్ గాంధీకి కూడా రిక్వెస్ట్ పెడుతూ..మిస్టర్ రాహుల్ గాంధీ గారు..మీరు నిజంగా మానవత్వాన్ని నమ్మినట్లయితే మీ నాయకుల మాటలను వెనక్కి తీసుకొని వారిని ఆపండి.రాజకీయ నాయకులే ఇలా క్రిమినల్స్ లాగా ప్రవర్తిస్తే ఈ దేశం ఎటు పోతుంది. మీరు వెంటనే స్పందించి ఆ మహిళ మంత్రిని మా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను అంటూ రాహుల్ గాంధీ కూడా రిక్వెస్ట్ పెట్టింది. ప్రస్తుతం అమల చేసిన పోస్ట్ మీడియాలో వైరల్ గా మారింది