వెంకటేష్ : అప్పటివరకు ఒక ఇమేజ్.. అప్పటినుండి వేరే లెవెల్.. వెంకటేష్ కెరీర్ను టర్న్ చేసిన బొబ్బిలి రాజా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ "కలియుగ పాండవులు" అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గుర్తింపు కలిగిన నిర్మాత అయినటువంటి రామానాయుడు కుమారుడు కావడంతో ఈయన మొదటి సినిమాపై ఆ సమయంలో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వెంకటేష్ చాలా సినిమాలలో నటిస్తూ వచ్చాడు.

అందులో చాలా తక్కువ సినిమాలే మంచి విజయాలను సాధిస్తూ వచ్చాయి. దానితో ఆయన కెరియర్ పర్వాలేదు అనే స్థాయిలో కొనసాగుతూ వచ్చింది. అలాంటి సమయంలోనే విక్టరీ వెంకటేష్ , బి గోపాల్ దర్శకత్వంలో బొబ్బిలి రాజా అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో దివ్య భారతి హీరోయిన్గా నటించింది. ఇళయరాజా సంగీతం అందించిన ఈ మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి సురేష్ బాబు నిర్మించారు. ఈ సినిమా 1990 సంవత్సరం సెప్టెంబర్ 14 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన టాక్ ను తెచ్చుకుంది.

ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కంటే ముందు వెంకటేష్ ఎన్నో సినిమాలలో నటించిన ఈ స్థాయి విజయం మాత్రం అప్పటి వరకు ఆయనకు దక్కలేదు. ఈ మూవీ లో వెంకటేష్ తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను ఈ మూవీ తో వెంకటేష్ దక్కించుకున్నాడు. ఈ సినిమాతో ఈయనకు మాస్ జనాల్లో అద్భుతమైన క్రేజ్ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: