చిన్న వయసులోనే చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. ఆ ఘనత ఏ హీరోకి సాధ్యం కాదేమో..?
* ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన ఆ రెండు సినిమాలు
* చిన్న వయసులోనే తిరుగులేని మాస్ ఇమేజ్ ఎన్టీఆర్ కే సొంతం
* నటనలో తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు
విశ్వావిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారకరామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.. బాల నటుడిగా ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేసారు. గుణశేఖర్ తెరకెక్కించిన ‘రామాయణం’ సినిమాలో బాల రాముడిగా ఎన్టీఆర్ తనలోని నటనాచాతుర్యాన్ని చూపించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ నటనకు సర్వత్రా ప్రశంసలు అందాయి..ఎన్టీఆర్ బాల్యంలోనే కూచిపూడి, భరతనాట్యంలో ప్రతిభ చాటారు..’నిన్ను చూడాలని’ సినిమాతో ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు.. ఆ సినిమా అంతగా మెప్పించకపోయిన ఎన్టీఆర్ ని గ్రాండ్ గా పరిచయం చేసింది.. ఆ తరువాత్ ఎస్ఎస్. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ‘ స్టూడెంట్ no.1” సినిమాతో ఎన్టీఆర్ తన కెరీర్ ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్నాడు.. అయితే ఎన్టీఆర్ లోని మాస్ హీరోని బయటకు తీసింది మాత్రం “ఆది” సినిమానే.. ఆది సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.. వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో వసూళ్ల సునామి సృష్టించింది..
ఆది సినిమాలో సమయంలో ఎన్టీఆర్ వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే అంత చిన్న వయసులో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు.. ఆది సినిమాకు అప్పట్లో ఊహించని కలెక్షన్స్ వచ్చాయి.. చిన్న వయసులోనే ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు.. ఆ తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రెండో సినిమాగా వచ్చిన’సింహాద్రి’ సినిమాలో నటించాడు.. ఈ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించింది అంటే అప్పటి వరకు టాలీవుడ్ చరిత్రలో వున్న బిగ్గెస్ట్ రికార్డ్స్ అన్నిటిని తుడిచి పెట్టేసింది.. ఎన్టీఆర్ ని తిరుగులేని మాస్ హీరోని చేసింది.. చిన్న వయసులోనే ఎన్టీఆర్ ఇంతటి క్రేజ్ తెచ్చుకోవడం మాములు విషయం కాదు..ఎన్టీఆర్ కు సింహాద్రి సినిమాతో ఊహించని స్టార్ డం వచ్చింది.. సింహాద్రి సినిమాతో ఎన్టీఆర్, రాజమౌళి స్నేహబంధం మరింత బలపడింది..ఎన్టీఆర్ నందమూరి వంశంలో బాలకృష్ణ తరువాత అంతటి క్రేజ్ తెచ్చుకున్న హీరో.. నటన విషయానికి వస్తే తాతకు తగ్గ మనవడిగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నారు..