బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సినిమా వాళ్లకి ఎంతో మద్దతుగా నిలిచేవారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదు.కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటినుండి టాలీవుడ్ ని అన్ని విషయాల్లో వేధింపులకు గురి చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.సినిమా టికెట్ల రేట్లు పెంచాలంటే కచ్చితంగా డ్రగ్స్ విషయంలో సెలెబ్రెటీలు అందరూ స్పందించాలంటూ రేవంత్ రెడ్డి ఒత్తిడి తెచ్చారు. మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళని ఎక్కువగా కాంట్రవర్సీలలో ముంచెత్తుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడం కోసం డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ విషయాన్నీ బయటికి తీసుకు వస్తూ కేటీఆర్ తో ముడి పెడుతూ రకుల్,సమంత వంటి పేర్లను బయటికి లాగుతున్నారు. ఈ విషయంలో సమంత, రకుల్ అభిమానులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది.మరీ ముఖ్యంగా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక అక్కినేని ఫ్యామిలీ పై పగ పట్టిందా.. కక్ష కట్టిందా అనే ఆలోచనలు అందరిలో కలుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అటు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులో అక్కినేని మాజీ కోడలు సమంత పేరు తీసుకురావడం అలాగే డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు తీసుకురావడం.. మరీ ముఖ్యంగా కేటీఆర్ కి సమంతకు ముడి పెడుతూ రేవంత్ రెడ్డి మాట్లాడడం వంటివి చేస్తున్నారు.
ఇక కొండా సురేఖ హైలెట్ అవ్వడం కోసం చేసిందో ఏమో తెలియదు కానీ ఒక అడుగు ముందుకు వేసి కేటీఆర్ సమంతా పర్సనల్ లైఫ్ లో వేలు పెట్టింది. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉంటాలంటే మీ కోడల్ని నా గదిలోకి పంపాలంటూ కేటీఆర్, నాగార్జున డిమాండ్ చేసినట్టు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొండా సురేఖ కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఇక ఈమె మాటలపై చాలామంది ఫైర్ అవుతున్నారు. అయితే ఇన్ని రోజులు లేని మాటలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరాకే ఎందుకు వస్తున్నాయి.అసలు అక్కినేని ఫ్యామిలీ పై ఎందుకు రేవంత్ సర్కార్ పగ పట్టింది అని చాలామంది మాట్లాడుతున్నారు. అయితే కొంతమందేమో రేవంత్ రెడ్డి కావాలనే అక్కినేని ఫ్యామిలీ పై పగ తీర్చుకుంటున్నారని, ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండడం కారణంగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెనకుండి రేవంత్ రెడ్డి తో ఇవన్నీ చేయిస్తున్నాడు అంటూ మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన సమయంలో కూడా అమరావతి నుండి ఆదేశాలు వచ్చాయి అంటూ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు బలంగా వినిపించాయి.
అంటే వీటన్నింటి వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నాడని, ఆయన బలంతోనే రేవంత్ రెడ్డి ఇలా అక్కినేని ఫ్యామిలీ పై కక్ష కట్టారు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పై కూడా ఇండస్ట్రీలోని ఓ ప్రముఖ నటుడు స్పందిస్తూ.. ఇదంతా ఏపీ నుండి వచ్చిన ఆదేశాలు..ఇండస్ట్రీ రంగంలో ఇదో కక్షపూరిత చర్య అంటూ నిప్పులు చెరిగారు. అయితే నాగార్జున జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా లేరు. కానీ కొంతమంది కావాలని దీన్ని ప్రచారం చేస్తున్నారు. అసలు అక్కినేని ఫ్యామిలీ ఇప్పటివరకు ఎలాంటి వివాదంలో కూడా వేలు పెట్టదు.అక్కినేని ఫ్యామిలీ ఏ విషయంలో కూడా తల దూర్చదు. ఇక పెళ్లిళ్ల విషయం అంటే అది కేవలం తమ పర్సనల్ విషయం దాన్ని మాట్లాడడం మనకి అనవసరం.ఇక అక్కినేని నాగేశ్వరరావు బతికున్నన్ని రోజులు కాంగ్రెస్ కు సపోర్ట్ గానే ఉన్నారు. అయితే ఆయన బయటికి వచ్చి ఏ రోజు ప్రత్యక్షంగా మద్దతు పలకక పోయినప్పటికీ కాంగ్రెస్ తరపునే ఆయన మాట్లాడారు. అలాంటిది ఇప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే అక్కినేని ఫ్యామిలీ పై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులతో పాటు సినీ జనాలు