టాలీవుడ్ లో నాచురల్ స్టార్ ను నిలపెట్టిన మూవీ ఇదే ?

Veldandi Saikiran
* అసిస్టెంట్ గా టాలీవుడ్ లోకి నాని
* అలా మొదలైంది నానికి గుర్తింపు
* 2011  లో రిలీజ్ఐన  అలా మొదలైంది
* కామెడీ సినిమాలతో నానికి క్రేజ్
 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ... కొంతమంది మాత్రమే స్టార్ డం.. తక్కువ కాలంలో తెచ్చుకుంటారు. అలాంటి వారిలో... నాచురల్ స్టార్ నాని మొదటి వరుసలో ఉంటారు. తనకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా చాలా కష్టపడి పైకి వచ్చారు. ఇండస్ట్రీలో నటుడిగా రాణించాలని... తన కెరీర్  ప్రారంభంలో  అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. సినిమా ఛాన్స్ కోసం చాలామందికి డబ్బులు ఇచ్చి కూడా మోసపోయారు.

 అలాంటి నాని ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నారు. తన సినిమాలో కామెడీ, సింపుల్ యాక్షన్ సీన్స్, మంచి స్టోరీ లైన్  కచ్చితంగా ఉంటుంది. అలాంటి  సినిమా నాచురల్ స్టార్ నాని ఎంచుకుంటారు. వాస్తవంగా తన కెరీర్ ప్రారంభంలో.. బాపు గారి దగ్గర అసిస్టెంట్ గా పని చేశారు నాని. ఆ తర్వాత రాజమౌళి చెంతన చేరి... దర్శకత్వానికి సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకున్నారు. రాజమౌళి చేసిన చాలా సినిమాలకు చాలా సహాయపడ్డారు.
 అయితే అలాంటి నాని... స్నేహితుడా అనే సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా మొదలైంది సినిమాతో ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా ఎదిగారు. స్నేహితుడా సినిమా తర్వాత చాలా సినిమాలు చేసి.. పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. కానీ 2011 లో వచ్చిన అలా మొదలైంది సినిమాతో... బంపర్ హిట్ అందుకున్నాడు నాని. ఈ సినిమాలో కామెడీ అలాగే స్టోరీ  లైన్ అద్భుతంగా ఉండటంతో జనాలకు బాగా ఎక్కింది.

 దానికి తోడు నాని యాక్టింగ్, అటు హీరోయిన్ నిత్యామీనన్  పర్ఫామెన్స్ అదిరిపోయాయి. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా... నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో... నానికి ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు రావడం మొదలయ్యాయి. జక్కన్న దర్శకత్వంలో ఈగ సినిమా చేసి మరో బంపర్ విషయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత... వరుసగా హిట్లు కొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా సరిపోదా శనివారంతో మరో హిట్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: