యూత్ లో క్రేజ్.. దశాబ్ద కాలం పాటు పవన్ కెరీర్ ను కాపాడిన మూవీ..!!

Pandrala Sravanthi
- ఖుషి చిత్రంతో తిరుగు లేని హీరోగా పవన్..
- పవన్ తో సినిమా చేస్తే ప్రాఫిట్ పక్కా  అనేలా ఎదిగాడు..
- ఖుషి తో నిర్మాతలను ఖుషి చేయడమే కాకదు ఇండస్ట్రీలో స్టార్ గా కూడా..

 పవన్ కళ్యాణ్ హీరోకు తగ్గట్టుగా ఫిజిక్ లేకపోయినా తన స్టైల్ తో అద్భుతమైన యాక్టింగ్ చేసేవాడు.  అలాంటి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ  కొన్ని చిత్రాలు ఆయనను  దారుణంగా దెబ్బతీశాయి. పవన్ తో సినిమా అంటే దర్శక నిర్మాతలు భయపడే సమయం వచ్చింది.  అలాంటి టైం లోనే పవన్ కెరియర్ ను పీక్స్ కు తీసుకెళ్లిన మూవీ ఖుషి. ఈ మూవీతో మళ్లీ పుంజుకున్న పవన్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పవచ్చు. మరి అలాంటి ఖుషి మూవీ గురించి కొన్ని వివరాలు చూద్దాం..
 పవన్ కెరియర్ ను మార్చిన ఖుషి మూవీ:
పవన్ కళ్యాణ్  కెరీర్ అటూ ఇటుగా ఉన్న సమయంలో ఖుషి వచ్చి చాలా ఖుషి చేసింది. తొలిప్రేమ,సుస్వాగతం సినిమాతో కాస్త యూత్లో ఫాలోయింగ్ పెంచుకున్నటువంటి పవన్ కళ్యాణ్  కెరియర్ ను ఖుషి ఒక స్టార్ రేంజ్ కు ఎదిగేలా చేసింది. ఖుషి తర్వాత గోకులంలో సీత నుంచి బద్రి చిత్రం దాకా అన్నీ 100 రోజులకు పైగానే థియేటర్లలో హల్ చల్ చేశాయి. తిరుగులేని హీరోగా మారిపోయాడు పవన్. అలాంటి పవన్ కళ్యాణ్ తమిళ్ హీరో విజయ్ చేసినటువంటి ఖుషి సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఈ చిత్రంలో విజయ్ ని ఇమిటేట్ చేయకుండా తనలాంటి పాత్రలోనే ప్రతి కాలేజ్ స్టూడెంట్ తనకు తానే ఓన్ గా ఊహించుకునేటట్టు సినిమా ఉండాలని అనుకున్నారు. ఇదే తరుణంలో అప్పటికే క్యూట్ బ్యూటీగా ఉన్న భూమికని హీరోయిన్ గా సెట్ చేశారు. అప్పటికే పాపులర్ సంగీత దర్శకుడుగా ఉన్న మణిశర్మను  సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఇక ఏం రత్నం నిర్మాతగా  ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ బడ్జెట్ తో ఖుషి మూవీని తెలుగులో తెరకెక్కించారు.

 2001 ఏప్రిల్ 26 ఖుషి సినిమా థియేటర్లోకి వచ్చింది. ఓపెనింగ్స్ లోనే బీభత్సం సృష్టించింది ఈ మూవీ. సినిమా అయిపోయి అభిమానులు బయటకు వచ్చారు.. మొత్తం అల్లర్లు, కేకలు.. సినిమా సూపర్ హిట్.. బంపర్ హిట్..అంటూ  దారుణంగా కేకలు పెట్టారు. సాంగ్స్ కానీ కథ కానీ సినిమా అదిరిపోయింది..పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయిపోయారు.  అలా ఈ చిత్రం సంచలన రికార్డులు సాధించి, అద్భుతమైన హిట్ సాధించింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్ జె సూర్య ఒక మామూలు ప్రేమ కథను అద్భుత కావ్యంగా తీర్చిదిద్ది ప్రతిక్షణం ఆసక్తి భరితంగా ఉండేలా చేయడంలో ఆయన డైరెక్షన్ గొప్పతనం ఏంటో చాలామంది అర్థం చేసుకున్నారు. ఈ విధంగా పవన్ కెరియర్ ను ఒక్కసారి ఆకాశానికి ఎత్తేసింది ఖుషి మూవీ. ఇక ఈ సినిమా తర్వాత ఆయన దాదాపు 15 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: