ఆర్జీవీ నోటి దూల...సమంతకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పొద్దు !
అంతేకాకుండా కొంతమంది సాటి మహిళ అయ్యుండి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదంటూ కొందరు నటీమణులు స్పందిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ప్రతి ఒక్కరూ స్పందించడం విశేషం. తాజాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆర్జీవి రియాక్ట్ అయ్యాడు. కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్పడమేంటి? తాను చేసిన వ్యాఖ్యలలో అత్యంత జుగుప్సాకరంగా అవమానించిందంటూఫైర్ అయ్యారు ఆర్జీవీ. అక్కినేని నాగార్జునని, నాగచైతన్యని... ఒక భర్త, మామగారు, ఒక కోడలిని, ఒక భార్యని వారికి సంబంధించిన ఆస్తిని కాపాడుకోవడానికి ఇబ్బంది పెట్టి అలా పంపించడానికి ట్రై చేయడం ఏంటి? అంటూ కొండా సురేఖపై ఫైర్ అయ్యారు.
అలా చేస్తే తాను విడాకులు ఇచ్చి వెళ్లిపోయిందని చెప్పడం కన్నా ఘోరమైన అవమానం నేను నా జీవితంలో వినలేదు, చూడలేదంటూ వర్మ పేర్కొన్నారు. ఇది కేవలం సమంతను అవమానించడం ఎలా అయ్యింది? వారి కోసమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరి కోసం ఈ విషయాన్ని నాగార్జున, చైతన్య సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరికి మరిచిపోలేని గుణపాఠం నేర్పాలని కోరారు. కొండా సురేఖ సమంతకు కాకుండా అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి అంటూ ఆర్జీవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అటు ఈ అంశంపై కొండా సురేఖ స్వారీ చెప్పడం జరిగింది.