లోక నాయకుడు కమల్‌హాసన్ తమిళ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ ఇండియన్ 2 “..గతంలో సూపర్ హిట్ అయిన ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు..అయితే శంకర్ తీసిన సినిమాలలో ఈ సినిమాకు వచ్చినన్ని వివాదాలు ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి.అంతలా శంకర్ ను ఇబ్బంది పెట్టింది.. సినిమా మొదలు పెట్టిన మొదట్లో భారీ ప్రమాదం జరగడం సినిమా మధ్యలో ఆగిపోవడం సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు తగ్గేలా చేసింది. ఇక ఇండియన్ 2 ఉండదేమో అని భావిస్తున్న సమయంలో కమల్ హాసన్ జోక్యం చేసుకుకోవడం ఇండియన్ 2 మళ్ళీ మొదలవడం అంతా చక చక జరిగిపోయాయి. దీనితో శంకర్ రాంచరణ్ తో మొదలు పెట్టిన “ గేమ్ ఛేంజర్ “ సినిమా కూడా నత్త నడకతో సాగుతూ వచ్చింది.
శంకర్ రెండు పడవలపై వెళ్తున్నట్లుగా కొన్నాళ్ళు ఈ సినిమా కొన్నాళ్ళు ఆ సినిమా ఇలా బాగానే బ్యాలన్స్ చేసాడు కానీ ఇండియన్ 2 రిజల్ట్ చూసిన నిర్మాత దెబ్బకు కంగు తిన్నారు.. ఈ కళాఖండం కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేశామా అని కుమిలిపోయారు…ఇండియన్ 2 మూలాన నిర్మాతకు వంద కోట్లకుపైనే నష్టాలను తెచ్చిపెట్టింది.ఇండియన్2 కు కొనసాగింపుగా ఇండియన్ 3 కూడా రానుంది. ఇప్పటికే మూడో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే బ్యాలెన్స్ గా ఉన్నట్లు సమాచారం.కాగా ఇండియన్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ ఇండియన్ 3 పై గట్టిగానే పడింది.. ఈ నేపథ్యంలో ఇండియన్ 3 డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియన్ 3 పై అసలు ఏ మాత్రం బజ్ లేదు. బిజినెస్ జరగడం కూడా కష్టంగానే మారినట్లు సమాచారం.ఓన్‌గా రిలీజ్ చేసి రిస్క్ తీసుకోవడం కంటే డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.