' దేవ‌ర ' 6 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌... బాక్సాఫీస్ భీభ‌త్సం చేసిప‌డేసిన తార‌క్‌..!

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి సినిమా వ‌చ్చి రెండున్న‌రేళ్లు దాటుతోంది. అలాగే సోలో సినిమా అయితే ఎప్పుడో ఆరేళ్ల క్రితం వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌ . ఎన్టీఆర్ ను సోలోగా చూసి ఆరేళ్లు అవుతుండ‌డంతో దేవ‌ర పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. తార‌క్ కు జోడీగా జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించగా... కొర‌టాల శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక 6వ రోజు గాంధీ జ‌యంతి రావ‌డం తో దేవ‌ర వ‌సూళ్లు ఒక్క సారిగా స్వింగ్ అయ్యాయి.

6వ రోజు దేవ‌ర 8.39 కోట్ల షేర్ రాబ‌ట్టింది .. ఇక ఓ వ‌రాల్‌గా ఏపీ - తెలంగాణ‌లో దేవ‌ర 6 రోజుల క‌లెక్ష‌న్లు రు .. 107.03 కోట్ల షేర్ రాబ‌ట్టింది .. ఏపీ - తెలంగాణ‌ లో ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ రు . 115 కోట్లు అయ్యింది. ఈ లెక్క‌న చూస్తే ఫ‌స్ట్ వీక్‌ కంప్లీట్ అయ్యే స‌రికే దేవ‌ర రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ - తెలంగాణ లో బ్రేక్ ఈవెన్ కు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

నైజాం – 3.71 కోట్లు
సీడెడ్ – 1.63
వైజాగ్ – 0.98
ఈస్ట్‌ – 0.42
వెస్ట్ – 0.33
కృష్ణ – 0.49
గుంటూరు – 0.46
నెల్లూరు – 0.37
--------------------------------
4వ రోజు షేర్ =  8.39 కోట్ల
--------------------------------
ఇక మొత్తం 6 రోజుల వసూళ్లు :
నైజాం – 41.46 కోట్లు
సీడెడ్- 22.26 కోట్లు
వైజాగ్ – 11.19 కోట్లు
ఈస్ట్‌ – 6.88 కోట్లు
వెస్ట్  - 5.48 కోట్లు
కృష్ణ- 6.28 కోట్లు
గుంటూరు – 9.19 కోట్లు
నెల్లూరు – 4.29 కోట్లు
-------------------------------------
6 రోజుల వ‌సూళ్లు =  107.03
-------------------------------------

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: