బిగ్‌బాస్ 8: యష్మీది ఇలాంటి చీప్ క్యారెక్టరా..
పై మణికంఠ యష్మీ కలిసి డాన్స్ చేశారు. పృథ్వీ ఆడవేషంలో స్టెప్పులు వేస్తూ ఆశ్చర్యపరిచాడు. పృథ్వీ గెటప్ చూసి విష్ణుప్రియ తెగ నవ్వేసుకుంది. ఈ టాస్క్‌లో కాంతార టీం విజయం సాధించింది వారందరికీ చాక్లెట్స్ ఇచ్చి కంగ్రాట్యులేషన్స్ తెలిపాడు బిగ్ బాస్. సర్వైవల్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని గేమ్స్ లో ఎక్కువ ఎవరు గెలిచారో లెక్కలు వేశాడు. వాళ్లకే ప్రత్యేకమైన పవర్స్ ఇచ్చాడు. కాంతార టీమ్ స్పెషల్ పవర్ సాధించి తమ క్లాన్ నుంచి నేరుగా చీఫ్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ విషయమై కొంతసేపు డిస్కషన్ జరిగింది.
యష్మీ నేనే చీఫ్ అవుతానంటూ మొరపెట్టుకుంది. పృథ్వీకి నాలెడ్జ్ లేదు కదా అతడు పనికిరాడు అంటూ చాలా అవమానకరంగా మాట్లాడింది. దానికి పృథ్వీ చాలా కోపంగా రియాక్ట్ అయ్యాయి. ఆమెను తిట్టుపోసాడు. నువ్వు చీఫ్ అయితే హౌస్ సర్వనాశనం అవుతుందని అన్నాడు. యష్మీ ఈ మాటలు వినగానే అరవడం మొదలు పెట్టింది. నువ్వు వాయస్ పెంచకు అనే పృథ్వీ ఆమెపై కౌంటర్ అటాక్ చేశాడు. "ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావ్, అప్పుడు నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావ్.. మళ్లీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావ్..?" అంటూ పృథ్వీ ఆమెపై తిరిగి అరిచేశాడు.
అంతేకాదు పృథ్వీ యష్మీ బాగోతాలను ఒక్కొక్కటిగా బట్టబయలు చేశాడు. "నువ్వు మణికంఠని మగాడు కాదని అన్నావ్ కదా.. అనలేదని అబద్దం చెప్పావ్" అని ప్రశ్నించే అందరూ నిర్ఘాంత పోయేలా చేశాడు. ఆ ప్రశ్నకు యష్మీ సరిగా సమాధానం చెప్పలేదు. చివరికి నేను చెప్పలేదు అంటూ ధైర్యం కూడగట్టుకుని అన్నది. "అవునా.. నువ్వు అననప్పుడు ఎందుకు సారీ చెప్పావ్?" అని లాజిక్ గా ప్రశ్నించాడు పృథ్వీ. దాంతో ఆ పాయింట్ ఇప్పుడు అనవసరం అంటూ తప్పించుకుంది. "ఆ టాపిక్ ఎత్తకు.. మమ్మీపై ఒట్టేశాను కదా’ అని యష్మీ కామెంట్స్ చేసింది. "మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు. దాన్ని మళ్లీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు." అని పృథ్వి ఇంకా ఆడేసుకున్నాడు అయితే ఒక అబ్బాయిని పట్టుకొని అతను అబ్బాయి కాదు అని అనడం చాలా తప్పు అని ప్రేక్షకులు అంటున్నారు. యష్మీది మరీ అంత చీప్ క్యారెక్టర్ అని ఆమెను తిట్టిపోతున్నారు.