కాంగ్రెస్‌కు అక్కినేని ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్.. నాగ్ vs రేవంత్ ఎక్కడ చెడింది..!
ఆ తర్వాత అయినా ఒకప్పుడు ఎంతో దగ్గరగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఆయన కొడుకు నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ చెరువులో అక్రమంగా నిర్మించారంటూ కూలగొట్టింది.. ఒకరకంగా రేవంత్ గౌర్నమెంట్ నాగార్జునను టార్గెట్ చేయడం.. ఇటు సిని రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి నాగార్జున ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ అయింది? మొన్న N కన్వెన్షన్ కూల్చివేత నేడు సమంత - నాగచైతన్య విడాకుల ఇష్యూ పై కాంగ్రెస్ రచ్చ చేయడానికి కారణాలేమిటి ? ఇదే చర్చ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు వచ్చినప్పటి నుంచి అక్కినేని కుటుంబాన్ని తప్ప మరెవరిని టార్గెట్ చేసినట్లు కనిపించడం లేదు.
ఈ ఇష్యూ కాంగ్రెస్ పార్టీలో కొందరికి అసలు నచ్చటం లేదని కూడా సమాచారం. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనుక ఎవరి హస్తం ఉందనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్‌కు చెందిన ఓ బడా ఫ్యామిలీ పై ఇంత కక్ష సాధింపులు ఏంటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు నాగచైతన్య - సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను సంచలంగా మారి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో నెట్టింది. రాజకీయాల కోసం మరి ఇంతలా దిగజారి పోవాల అంటూ సోషల్ మీడియాలో ప్రజలు మండిపడుతున్నారు.