ఈ సినిమాల్లో హీరోల ఎంట్రీ చూస్తే .. హాలీవుడ్ సినిమాలు పనికిరావు.. ఇక పూనకాలే..!
అయితే వీరందరి కంటే కొంతమంది హీరోల ఎంట్రీలు ఎంతో కొత్తగా, ఊర మాస్ లెవెల్ లో ఉంటాయి. ఈ ఇంట్రడక్షన్ ను చూస్తే హాలీవుడ్ సినిమాలు కూడా పనికిరావు అనే విధంగా అనిపిస్తాయి. ఆ సన్నివేశాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలోని ఇంట్రడక్షన్ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ మూవీ ఆవరేజ్ గా మిగిలిపోయింది.
తారక్ ఇంట్రో సీన్ లో ఆయన గురించి ఒక డిస్క్రిప్షన్ కూడా చెప్తారు.“అతడు ఎదురుగా ఎలాంటివాడు ఉన్నా తన తల దన్నే లాగా ఉంటాడు.వాడి బ్లడ్ వాడిలాగే బి నెగిటివ్.వాడి నరాలు నరాలు కాదు హై టెన్షన్ వైర్లు.” అని బాగా ఎలివేట్ చేస్తారు.ఈ ఎలివేషన్ చేసే సమయంలోనే సైమల్టేనియస్గా అస్తిపంజరం వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది.
ఆ స్కెలిటన్ అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే నేలపై ఉన్న దుమ్ము లేచిపోతుంది.తర్వాత ఆ అస్తిపంజరం చుట్టూ మజిల్స్ పెరగడం, తర్వాత రక్తం ఆ బాడీలో సర్కులేట్ కావడం చూపించారు. ఒక లావా లాగా అతని రక్తం ఉడుకుతూ ఉంటుంది.తర్వాత నరాలు ఆ బాడీ అంతా విస్తరించడం, అది జూనియర్ ఎన్టీఆర్ రూపం దాల్చడం కనిపిస్తుంది. చివరికి తారక్ ఒక పెద్ద గోడని ఢీకొడితే ఆ గోడ కూడా తునాతునకలవుతుంది.ఆల్రెడీ ఈ ఇంట్రడక్షన్ చూడకపోతే ఒకసారి అయినా దీన్ని చూడాల్సిందే.
ఇక అలాగే రామ్ చరణ్ తొలి సినిమా చిరుత ఇంట్రడక్షన్ సన్నివేశం కూడా గూస్ బుంప్స్ తెప్పిస్తుంది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో 2007లో వచ్చిన ఈ మూవీ చరణ్ తొలి మూవీగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ చూస్తే మొహానికి గుడ్డ కొట్టుకొని రౌడీలు తనని గుత్తు పట్టి మళ్ళీ అట్టాక్ చేయకుండా ఉండటానికి ఆలా చేస్తాడు.. అయితే ఫైట్ చూస్తున్నప్పుడు ఒక ఖైదీ చరణ్ ముఖాన్ని కట్టుకున్న వస్త్రాన్ని పట్టుకొని లాగేస్తాడు అప్పుడు రామ్ చరణ్ గాల్లో చుట్టూ తిరుగుతూ ఫేస్ కి ఉన్న క్లాత్ని వెపుతాడు. అలా తన ఫేస్ రివిల్ చేసి ఎంతో అద్భుతంగా ఎంట్రీ ఇస్తాడు. ఈ సన్నివేశానికి మణిశర్మ ఇచ్చిన బిజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
అలాగే పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలలో ఆయన ఇంట్రడక్షన్ సీను కూడా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మరి ముఖంగా బాహుబలి 2 లో ప్రభాస్ ఏనుగుల అదుపు చేయడానికి ఒక పెద్ద వినాయకుడు రాదని లాక్కుంటూ వస్తాడుమరి ముఖంగా బాహుబలి 2 లో ప్రభాస్ ఏనుగుల అదుపు చేయడానికి ఒక పెద్ద వినాయకుడు రాదని లాక్కుంటూ వస్తాడు. ఈ సన్నివేశం చూడడానికి ఎంతో బాగుంటుంది.
అలాగే ప్రభాస్ నటించిన బిల్లా సినిమా కూడా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఇందులో ఆయన ఎంట్రీ కూడా హాలీవుడ్ రేంజ్ లో స్టైలిష్ షూట్లోో ఇంటర్ ఇస్తాడు. పైన హెలికాప్టర్ తిరుగుతూ ఉంటే ప్రభాస్ వాటి కింద సూట్ కేసు పట్టుకుని నడుస్తూ వస్తుంటాడు అది చూస్తుంటే ఎవరికైనా విజిల్ వచ్చేస్తుంది. అదే విధంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్యాలో ఆయన ఇంట్రడక్షన్ కూడా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఇక ఇందులో బన
ఒక డ్రైనేజీలోకి దూకి ఓ కుక్క పిల్లను కాపాడతాడు.అతన్ని వాటర్ తో కడుగుతారు. అప్పుడు బన్నీ ఫేస్ రివిల్ అవుతుంది.ఇలాంటి ఇంట్రో ఎవరూ కూడా చేసే సాహసం చేయలేదంటే అతిశయోక్తి కాదు.