అమితాబచ్చన్ కె చుక్కలు చూపించిన కమల్.. దెబ్బకు సినిమా నుంచి పరార్.. !
ఇక ఇది మీకు వింటుంటే వింతగా ఉంది .. 80వ దశకమంలో మన భారతీయ చిత్ర పరిశ్రమలోనే నెంబర్ 1న్ హీరోగా కొనసాగారు అమితాబ్ .. అలాంటి ఈ అగ్ర హీరో కమలహాసన్ కి భయపడటం ఏంటి? అని అనుకుంటున్నారా.. ఇదే విషయాన్ని తమిళ దర్శకుడు భాగ్యరాజ్ గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అమితాబ్ బచ్చన్ - కమలహాసన్ కాంబోలో టాలీవుడ్ సీనియర్ దర్శకుడు తాతనేని రామారావు ఓ సినిమా చేయాలని భావించారు.. ఆ సినిమా కథ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగి , అతనికి చికిత్స చేసే వైద్యుడు చుట్టూ తిరిగే స్టోరీ.
ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం రాయక ముందు .. ముందుగా అమితాబ్ బచ్చన్‌ను సంప్రదిస్తే.. తాను ఈ సినిమాలో నటించడానికి రేడీగా ఉన్నానని చెప్పారు.. దీంతో దర్శకుడు స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసి ఖబర్దార్ అనే టైటిల్‌ని కూడా ఫిక్స్ చేశారు. అంతా రెడీ అయిన తర్వాత అమితాబ్ కు స్టోరీ చేప్పారు. అదేవిధంగా సగభాగం పైగా సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ సినిమా నుంచి అమితాబ్ బయటకు వచ్చేశారు.
ఆ సినిమా పతాక సన్నివేశంలో కమల్ పాత్ర చనిపోతుందట. ఆ పాత్ర చనిపోవడంతోనే కథకు బలం చేకూరుతుందట. కానీ కమల్ పాత్ర చనిపోతే అదే సినిమాకు హైలైట్ అవుతుందని .. చనిపోయే సన్నివేశంలో కమల్ నటన ముందు తాను తేలిపోతానని అమితాబ్ భయపడ్డట్లు భాగ్యరాజ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఓపెన్‌గానే తనతో చెప్పారని.. ఈ సినిమా తన ఇమేజ్ను డ్యామేజ్ చేస్తుందని భావించారని.. డబ్బులు పోయినా పర్వాలేదు, కానీ పేరు పోకూడదని చెప్పారని.. దీంతో ఆ సినిమా తాను చేయలేనని.. కావాలంటే మరో సినిమాకు డేట్లు ఇస్తానని చెప్పి ఆయన తప్పుకున్నారని భాగ్యరాజ్ వెల్లడించారు.
విచిత్రంగా ఆ తర్వాత కమల్ హాసన్ తో కలసి గిర్ఫతార్ సినిమాలో నటించారు. ఇందులో రజనీకాంత్ కూడా నటించారు. అమితాబ్ దక్షిణాది సినిమాల్లో పెద్దగా నటించలేదు. మనం సినిమాలో ఓ చిన్న కామియో రోల్ లో కనిపించారు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డిలో నూ నటించారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కె లో నటిస్తున్నారు అమితాబ్ బచ్చన్.